మా అందరితో కలసి నడుస్తుంటే మాలో ఒకడివనుకున్నాం
మాతోపాటే ఉండి నువ్వు వెనకగా నడుస్తూ మిగిలిన వాళ్ళను ముందుకు నడిపిస్తూ ఉంటే, మా లోనే వెనకబడినవాడివేమో అనుకున్నాం
కొంచెం దూరం నడిచాక మా కన్నా ఎంతో ముందు నువ్వు మిగతా వాళ్లందరితో కలసి కనిపిస్తే…. ఆశ్చర్యపడి … సరేలే మా కన్ను గప్పి ఎప్పుడో ముందుకు పరిగెట్టుకుంటూ వెళ్ళావనుకున్నాం……..
దారిపక్కనున్న చెట్టెక్కి చూస్తే చుట్టూ పక్కల ఉన్న ఊళ్ళన్నీ నీ కోసం కదిలొస్తున్నాయని తెలిసీ … ఒకింత ఆనందానికీ గురయ్యామ్….
నువ్వు మాట్లాడుతుంటే అందరూ ఊగిపోతూ వింటూ ఉంటే… నువ్వు మాటకారివనుకున్నాం.
నువ్వు ముందు నడచి మా అందరి ఇళ్ళలో జ్యోతులు వెలిగింపచేస్తే… నాయకుడివే అనుకున్నాం….
శత్రువుల దాడులూ ఇంటిదొంగల వెన్నుపోటులూ తట్టుకుని మౌనంగా మమ్మల్ని నీ గుండెల్లో పెట్టుకుని మోస్తుంటే… నోరెళ్ళబెట్టుకుని నిన్నే చూస్తున్నాం….
ఇన్నిరోజులకు వాడెవడో ఇంకెవడో వచ్చి….. ఎప్పుడో మా గుండెల్లో నిండి పోయిన నిన్ను తీసేస్తామంటే… ఎలా ఊర్కుంటాం…. ?
నిన్ను తలుచుకుంటేనే… మా రోమాలు నిక్కపొడుచుకుంటాయి….. నీ మాటలు గుర్తుతెచ్చుకుంటే… మా గుండెలు ధైర్యంతో నిండిపోతాయి….
తువాల తీసి నడుముకు చుట్టి ఒక్కొక్క అడుగు వేస్తూ ఒక్కొక్కరినీ కలుపుకుంటూ ముందుకు వెళ్తామ్….
మాకోసం నీ వర్తమానాన్ని కాదనుకున్న, నీ భవిష్యత్తును వద్దనుకున్న నీకోసం … మేం అహరహమూ కష్టపడతామ్…. …నిన్ను మళ్ళీ ప్రతిష్టించుకుంటామ్ ….
మాలో ఒకడివి … కాదు కాదు
నాయకుడివి….. ఊహూ
నరేంద్రుడి వి నువ్వు ….
నవ భారతాన్ని నిర్మిస్తున్న నీ యజ్ఞం లో మేము భాగమవుతాం…. సమిధలమవుతాం……..
భారత్ మాతాకీ జై.
April 2019