స్వఛ్ భారత్ ఉద్యమం – తెలంగాణ

2014 వ సంవత్సరం ఆగస్ట్ 15వ తేదీన చారిత్రక ఎర్రకోట మీదనుండి గౌరవ ప్రధాన
మంత్రి స్వచ్చ భారత్ స్వప్నం గూర్చి యావత్ దేశాన్ని ఉద్దేశ్యించి ప్రసంగించడం తో
ప్రారంభమయిన స్వచ్చ ఉద్యమం, బస్తీలను, వార్డులను, పంచాయతీలను,
మునిసిపాలిటీలను ముంచెత్తింది. దేశంలోని ప్రగతిని కాంక్షించే ప్రజలంతా స్వచ్చందంగా ముందుకు వచ్చి స్వచ్చ ఉద్యమంలో
పాలుపంచుకున్నారు. మొత్తం దేశాన్ని స్వచ్చంగా మార్చేందుకు స్వచ్చ దూతలై, స్వచ్చాగ్రాహీలై ముందుకు కదులుతున్నారు.
స్వచ్చ భారత్ మిషన్ ప్రారంభం.

9,91,56,459 31,80,173
2014 నాటికి పారిశుధ్య శాతం 38.70 27.34
మహాత్మ గాంధి 150 వ జయంత్యుత్సవం 2019 నాటికి మొత్తం దేశాన్ని బహిరంగ మల మూత్ర విసర్జన రహితంగా మార్చాలనే
బృహదాశయంతో త్రాగునీరు మరియు పారిశుధ్య మంత్రిత్వ శాఖ మరియు పురపాలక మంత్రిత్వ శాఖ ల ఆధ్వర్యంలో, 2014 అక్టోబర్
02 న అధికారికంగా స్వచ్చ భారత్ మిషన్
ప్రారంభించబడింది. పట్టణ ప్రాంతాలలో స్వచ్చ భారత్
మిషన్ (అర్బన్) గా, గ్రామీణ ప్రాంతాలలో స్వచ్చ భారత్
మిషన్ (గ్రామీణ) గా కార్యక్రమాలు ప్రారంభించబడ్డాయి.
కేంద్ర ప్రభుత్వ లక్ష్యానికి అనుగుణం గా అన్ని రాష్ట్రాలలో
అప్పటికే ఉన్న నిర్మల్ భారత్ అభియాన్ కార్యక్రమాలు
స్వచ్చ భారత్ మిషన్ గా రూపాంతరం చెందించబడ్డాయి.
మరుగు దొడ్డి నిర్మాణానికి గతంలో ఉన్న ప్రోత్సాహక మొత్తాన్ని స్వచ్చ భారత్ కార్యక్రమం లో ₹.12000 కు పెంచడం జరిగింది. 2011
సంవత్సరం లో జరిగిన బేస్ లైన్ సర్వే ప్రకారం దేశం లో 16.17 కోట్ల గ్రామీణ కుటుంబాలుండగా, వాటిలో 5.98 కోట్ల కుటుంబాలకు
మాత్రమే మరుగుదొడ్లు ఉన్నాయి. 2014 అక్టోబర్ 02 నాటికి దేశం లో కట్టవలసిన మరుగుదొడ్లు 9.91 కోట్లు. అదే సమయానికి
తెలంగాణ రాష్త్రం లో గ్రామీణ ప్రాంతాలలో కట్టవలసిన మరుగుదొడ్ల సంఖ్య 32 లక్షలు. తెలంగాణ రాష్ట్రంలో స్వచ్చ భారత్ కార్యక్రమం
ప్రారంభించబడే నాటికి మరుగుదొడ్లు కలిగి ఉన్న గ్రామీణ ప్రాంత కుటుంబాల శాతం 27.34% మాత్రమే.
ప్రభుత్వ వ్యూహం
స్వచ్చ భారత్ కార్యక్రమం ప్రారంభించే నాటికి అమలులో ఉన్న నిర్మల్ భారత్ అభియాన్ పథకం ప్రధానంగా గ్రామీణ కుటుంబాన్ని
యూనిట్ గా తీసుకుని, సంవత్సరానికి కట్టిన మరియు కట్టవలసిన మరుగుదొడ్లను లెక్కిస్తూ సమీక్షించే పధ్ధతి అనుసరించే వారు.

స్వచ్చ భారత్ మిషన్ ప్రారంభమయిన తరువాత, గ్రామాన్ని/గ్రామ పంచాయతి ని యూనిట్ గా తీసుకుని గ్రామాన్ని బహిరంగ మల
విసర్జన రహిత గ్రామంగా ప్రకటించే సాచ్యురేషన్ వ్యూహాన్ని అమలులోకి తెచ్చారు. దీనివల్ల సంవత్సరానికి ఎన్ని గ్రామాలు బహిరంగ
మల విసర్జన రహిత గ్రామాలు (ఓడీఎఫ్) గా మారుతున్నాయో లెక్కిస్తూ సమీక్షించే వ్యూహం ప్రారంభమయింది. ఈ పధ్ధతి పెద్ద ఎత్తున
విజయం సాధించింది. ఈ పద్ధతిలో గ్రామాలు ఒకదాని వెనక మరొకటి వరుసగా ఓడీఎఫ్ గ్రామాలు గా మారడం ప్రారంభమయ్యింది.
గ్రామం లో మరుగుదొడ్లు కట్టుకోకుండా మిగిలిపోయిన వారిపై తోటి గ్రామస్తుల వత్తిడి పెరగడం వల్ల కూడా మరుగుదొడ్ల నిర్మాణం
ఊపందుకుంది. దీనికి తోడు తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన సాఫ్ట్ వేర్ ఆధారిత చెల్లింపుల విధానం లోని పారదర్శకత ప్రజలను స్వచ
ఉద్యమంలో పాల్గొని మరుగుదొడ్లు కట్టుకుని వాడుకునేలా చేసింది.
స్వచ్చ భారత్ మిషన్ అమలు – తెలంగాణ రాష్ట్ర సంస్కరణలు.
గ్రామజ్యోతి:
కేంద్ర ప్రభుత్వం గ్రామాలను ఒడీఎఫ్ గా మార్చుతూ తద్వారా జిల్లాలను రాష్ట్రాలను ఓడీఎఫ్ గా మార్చాలనే లక్ష్యం పెట్టుకోగా, రాష్ట్ర
ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వ వ్యూహాన్ని మరికొంత మార్చి, కేంద్రం ప్రకటించిన గడువు కన్నా ఒక సంవత్సరం ముందుగానే అంటే 02
అక్టోబర్ 2018 నాటికే వంద శాతం పారిశుధ్యాన్ని సాధించాలని నిర్దేశించింది. అందులో భాగంగా ముందుగా అసెంబ్లీ
నియోజకవర్గాలను బహిరంగ మల విసర్జన రహితంగా మార్చాలని, శాసన సభ్యులనే చేంజ్ ఏజెంట్ గా చేస్తూ గ్రామ జ్యోతి
కార్యక్రమాన్ని 2015 వ సంవత్సరంలో ప్రారంభించింది. గ్రామజ్యోతి కార్యక్రమం ప్రధానంగా 9 విభాగాలలో అభివృద్ధి పనులను
వేగవంతం చేసేందుకు నిర్దేశించినది. ఇందులో మొదటి అంశం గ్రామంలో 100 % కుటుంబాలు మరుగుదొడ్డి కట్టుకుని వాడుకోవటం.
గ్రామజ్యోతి కార్యక్రమం వల్ల, సిరిసిల్ల, సిద్ధిపేట, వేములవాడ, గజ్వేల్ అసెంబ్లీ నియోజక వర్గాలలోని అన్ని గ్రామాలు బహిరంగ మల
విసర్జన రహితంగా మారి రాష్ట్రంలోని మిగతా గ్రామాలకు, నియోజకవర్గాలకు దిశానిర్దేశం చేసాయి. గ్రామజ్యోతి కార్యక్రమం ద్వారా
మరుగుదొడ్ల నిర్మాణం విజయవంతం కావటంతో, అన్ని జిల్లాలలో గ్రామాలను సాచ్యురేషన్ పద్ధతిలో ఓడీఎఫ్ గా మార్చే కార్యక్రమం
ప్రారంభమయ్యింది.
కొత్త జిల్లాలు మరియు సాఫ్ట్ వేర్ ఆధారిత చెల్లింపులు:
త్రాగునీరు & పారిశుధ్య మంత్రిత్వ శాఖ కార్యదర్శి 2016లో ప్రారంభించిన 100 ఓడిఎఫ్ జిల్లాల కార్యక్రమంలో తెలంగాణా రాష్ట్రం లో
మరుగుదొడ్ల నిర్మాణం లో మెరుగైన పనితీరు చూపిస్తున్న 3 పాత జిల్లాలు కరీంనగర్, మెదక్ మరియు నిజామాబాద్ ఎంపికయ్యాయి.
ఈ కార్యక్రమంలో పనులు సాగుతుండగానే, తెలంగాణా ప్రభుత్వం, జిల్లాల రీ ఆర్గనిజేషన్ చట్టం 2016 తీసుకువచ్చి పాత 10 జిల్లాలను,
31 జిల్లాలుగా ఏర్పరచడం జరిగింది. రాష్ట్రం లో కొత్త జిల్లాలలో భాగంగా ఏర్పాటైన రాజన్న సిరిసిల్ల జిల్లా మొదటి బహిరంగ మల
విసర్జన రహిత జిల్లాగా అవతరించింది. అప్పటికే విస్తృతంగా సాగుతున్న స్వచ్చ ఉద్యమం కొత్త జిల్లాల ఏర్పాటు వల్ల మరియు

పంచాయతీరాజ్ & గ్రామీణాభివృద్ధి శాఖ http://www.sbmgramin.telangana.gov.in వెబ్ సైట్ సహాయంతో పూర్తిస్థాయిలో
పాలుపంచుకోవటం వల్ల మరింత వేగంగా ముందుకు సాగింది.
గ్రామ నీరు & పారిశుధ్య కమిటీలు
శాసన సభ నియోజకవర్గ పరిధిలోని అన్ని గ్రామాల సర్పంచులు, MPTCలు పంచాయతి కార్యదర్శులు అందరితో సమావేశం
ఏర్పరిచి,వారి సందేహాలను తీర్చి వారి వారి గ్రామాలలో మరుగుదొడ్ల నిర్మాణాలను వేగవంతం చేసే కార్యక్రమాలను కరీంనగర్ జిల్లాలో
ప్రారంభించడం జరిగింది. గ్రామ నీరు & పారిశుధ్య కమిటీలకు రాష్ట్ర
వ్యాప్తం గా శిక్షణా కార్యక్రమాలు నిర్వహించడం, ఆయా గ్రామాల్లో
స్వచ్చ ఉద్యమంలో ప్రజల భాగస్వామ్యం పెరగడానికి
కారణమయ్యింది. సాఫ్ట్ వేర్ ద్వారా చెల్లింపులు కూడా గ్రామ నీరు & పారిశుధ్య కమిటీల అకౌంట్లలోకి పంపించడం కూడా స్వచ్చ
ఉద్యమం లో స్వయం సహాయక మహిళా సంఘాలు క్రియాశీలకంగా మారడానికి దోహదపడింది. గ్రామ నీరు & పారిశుధ్య కమిటీలు
క్రియాశీలకంగా మారి మరుగుదొడ్ల నిర్మాణానికి అవసరమయిన అన్నిరకాల సామాగ్రిని ఒకేసారి కొనడం తయారు చేయడం వంటి
కార్యక్రమాలు లబ్దిదారులపై ఆర్ధిక భారాన్ని తగ్గించింది.
రాష్ట్ర ప్రభుత్వ వినూత్న ఆలోచన- లబ్దిదారులకు అడ్వాన్స్ చెల్లింపు.
ఏ రాష్ట్రం లోనూ లేని విధంగా, పరిపాలన అనుమతి పొందిన లబ్దిదారుడు, తన ఇంటి వద్ద
వ్యక్తిగత మరుగుదొడ్డి నిర్మించుకోవలసిన స్థలం లో స్థానిక ఫీల్డ్ అసిస్టెంట్ ఇచ్చిన డిజైన్
మార్క్ అవుట్ వద్ద నిలబడి ఫోటో దిగి, ఆ ఫోటోను మండల కంప్యుటర్ సెంటర్లో సాఫ్ట్ వేర్
కు అప్ లోడ్ చేయించినట్లయితే, రాష్ట్ర ప్రభుత్వం నుండి మరుగుదొడ్డి నిర్మాణ ప్రోత్సాహక
మొత్తం లో సగం డబ్బు అంటే ₹.6000 రూపాయలు గ్రామ నీరు & పారిశుధ్య కమిటీ
అకౌంట్ కు పంపించబడుతుంది. ఈ డబ్బు సంబంధిత లబ్దిదారుడికి అందించబడుతుంది.
ఈ డబ్బుతో లబ్దిదారుడు నిర్మాణానికి అవసరమైన సామాగ్రిని తెచ్చుకోవచ్చు. నిర్మాణం పూర్తయిన వెంటనే, ఫీల్డ్ అసిస్టెంట్ రెండవ
ఫోటోను తీసి తిరిగి సాఫ్ట్ వేర్ లోకి అప్ లోడ్ చేసిన వెంటనే రెండవ దశ ప్రాత్సాహక మొత్తం అంటే మిగిలిన₹.6000 రూపాయలు
గ్రామ నీరు & పారిశుధ్య కమిటీ అకౌంట్ లోకి జమ చేయడం జరుగుతుంది. ఈవిధంగా లబ్దిదారుడికి ఆర్ధిక భారం తగ్గించే విధమైన
చర్యలు రాష్ట్ర ప్రభుత్వం చేపట్టింది.
అవగాహన కార్యక్రమాలు.

ఒకవైపు అత్యంత సరళతరమైన సాఫ్ట్ వేర్ ఆధారిత చెల్లింపుల విధానాన్ని ప్రవేశపెట్టి, మరోవైపు గ్రామీణ ప్రాంతాల ప్రజలు పారిశుధ్య
అవసరాన్ని గుర్తించేలా చేసేందుకు తద్వారా మరుగుదొడ్ల నిర్మాణాన్ని చేపట్టేందుకు ఎన్నో రకాలైన అవగాహనా కార్యక్రమాలు రాష్ట్ర
ప్రభుత్వం చేపట్టింది.
కళాజాత – స్వచ్చ రథం : తెలంగాణా రాష్ట్రం లో
ప్రజలందరికి చిరపరిచితమైన జానపద కళా రూపాలను
ఉపయోగించి, ప్రజలలో చైతన్యం పెంచే విధంగా
కళాజాత బృందాలతో కూడిన స్వచ్చ రథాలను
గ్రామాలకు పంపించడం జరిగింది. ఈ రథాలు కళాత్మక పద్ధతుల్లో మరుగుదొడ్ల నిర్మాణం మరియు వాడకం పట్ల
అవగాహన కలిగించారు.
వాల్ పెయింటింగ్ : గ్రామాలలో ప్రజలంతా
గుమిగూడే ప్రాంతాలలో మరుగుదొడ్డి నిర్మాణం పట్ల
చైతన్యం పెంచే వాల్ పెయింటింగ్ లను అన్ని
జిల్లాలలో చేపట్టడం జరిగింది.
స్వచ్చాగ్రాహీలు : గ్రామంలో స్వయం సహాయక బృందాలలో క్రియాశీలకంగా ఉన్న ఒక మహిళను స్వచ్చాగ్రాహీ గా
నియమించి ఇంటింటికి తిరిగి ప్రజల సందేహాలు నివృత్తి చేసి, మరుగుదొడ్డి నిర్మాణానికి సంబంధించి అధికారులకు
లబ్దిదారులకు మధ్య ఒక వారధి లాగ పనిచేసేలాగా చేయటం.
గ్రామాలలో చైతన్యం – CLTS : పారిశుధ్యం పట్ల
చైతన్యం కలిగేందుకు CLTS (Community Led
Total Sanitation) కార్యక్రమం ద్వారా గ్రామంలోనే
పారిశుధ్య సమస్యను గ్రామస్తులందరూ కలిసి
పరిష్కరించుకునే విధంగా అవగాహన కలుగచేసి,
తద్వారా గ్రామాలను బహిరంగ మల విసర్జన రహిత గ్రామాలుగా మారేందుకు తోడ్పడటం. పార్టిసిపేటరీ రూరల్ అప్రైజల్
(PRA) అనే సోషల్ టెక్నిక్ ద్వారా గ్రామస్తులందరినీ ఒక్కతాటి మీదకు తేవడం ఈ కార్యక్రమ ప్రధాన లక్ష్యం.
వినూత్న కార్యక్రమాలు.

 జగిత్యాల, మెదక్, మహబూబ్ నగర్ వంటి జిల్లాల్లో కేవలం కొన్ని గంటల సమయంలోనే, మొత్తం గ్రామాన్ని
ఒడీఎఫ్ గా మార్చే వినూత్న కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఈ కార్యక్రమాలు ఆయా జిల్లాలలోని ఇతర
గ్రామాలనే కాక, రాష్ట్రంలోని ఎన్నో గ్రామాల ప్రజలను సైతం ప్రభావితం చేశాయి.
 బతుకమ్మ పండుగ సందర్భంగా గ్రామంలోని అందరు మహిళలతో కలసి గ్రామాన్ని స్వచ్చంగా చేస్తామనే
సంకల్పంతో స్వచ్చ బతుకమ్మ పండుగను నిర్వహించుకోవడం.
 రాష్ట్రంలోని అన్ని పాఠశాలల, కళాశాలల విద్యార్థులకు, యువతకు మరియు పంచాయతి సర్పంచులకు స్వచ్చ
ఉద్యమానికి, గ్రామ పారిశుధ్యానికి సంబంధించి, వ్యాస రచన, పెయింటింగ్ మరియు షార్ట్ ఫిలిం పోటీలను
నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమాల వల్ల పెద్ద ఎత్తున విద్యార్థులు యువత స్వచ్చ ఉద్యమంలో పాల్గొనడం
జరిగింది.
 గ్రామాలలో తిరిగి యువతను గ్రామ స్వచ్చ ఉద్యమంలో భాగస్వామ్యం చేసేందుకు దాదాపు అన్ని జిల్లాలలో
సంతకాల సేకరణ కార్యక్రమం మరియు యువతను
స్వచ్చందంగా పాల్గొనేలా చేయడం.
 గ్రామాన్ని స్వచ్చంగా మార్చడమే సేవ అనే భావన తో
అన్ని గ్రామాలలో,మండల కేంద్రాలలో మరియు జిల్లా కేంద్రాలలో రోడ్లను శుభ్ర పరచడం, ప్రభుత్వ
కార్యాలయాలను శుభ్రపరచడం, మంచి నీటి ట్యాంకులను శుభ్ర పరచడం, గ్రామాలలో మరుగుదొడ్లు కట్టుకోని
వారిని చైతన్యపరచడం, మురికి కాలువలను శుభ్రపరచడం వంటి కార్యక్రమాలను చేపట్టడం ప్రజల ఆలోచనా
సరళిని ఎంతగానో మార్చివేసింది.
 రాత్రి వేళల్లో గ్రామస్తులంతా కలసి కొవ్వొత్తుల ర్యాలీ చేయడం ద్వారా తమ గ్రామం స్వచ్చ వెలుగులను
విరజిమ్ముతోందని చాటి చెప్పడం. ఈ కార్యక్రమం ఎన్నో గ్రామాలలోని యువత లో ఎంతో విశ్వాసాన్ని
పాదుకొల్పిందని చెప్పవచ్చు.
 వివిధ సామాజిక ఉత్సవాల సందర్భంలో, స్వచ్చ ఉద్యమంలో పాల్గొన్న చాంపియన్ లను సన్మానించడం మరియు
వారి విజయగాథలు అన్ని పత్రికలలో వచ్చేలా చేయటం.
కేంద్ర ప్రభుత్వం అనుమతించిన స్వచ్చంద సంస్థలు
యునిసెఫ్, టాటా ట్రస్ట్ వంటి వాటి సహకారం తీసుకుంటూ,
ఆయా సంస్థల ప్రతినిధులను జిల్లా & రాష్ట్ర స్థాయుల్లో
నియమించి, శిక్షణా మరియు ప్రచార కార్యక్రమాలను రాష్ట్ర

ప్రభుత్వం ఉధృతం చేసింది. రాష్ట్రం అమలు చేస్తున్న సంస్కరణల వల్ల, వినూత్న కార్యక్రమాల వల్ల, కేంద్ర ప్రభుత్వం క్రమం తప్పకుండా
చేపడుతున్న శిక్షణ & సమీక్షల వల్ల ప్రజల భాగస్వామ్యం రోజురోజుకు పెరిగి, ఒక్క 2017-18 సంవత్సరంలోనే, మరుగుదొడ్ల
నిర్మాణాలలో దాదాపు 36% పెరుగుదల నమోదయ్యింది. ప్రజల క్రియాశీలక భాగస్వామ్యం ప్రభుత్వానికి మరింత ఉత్సాహాన్ని
కలుగచేసి, నిర్దేశించుకున్న గడువు 02 అక్టోబర్ 2018 నాటికి లక్ష్యాన్ని చేరతామనే భరోసాను కల్పించింది.
అంతే కాక, బహిరంగ మల విసర్జన రహిత గ్రామాలుగా మారిన తరువాత, గ్రామీణాభివృద్ధి శాఖ అమలు చేస్తున్న ఘన ద్రవ
వ్యర్థ యాజమాన్య కార్యక్రమాలలో పాలుపంచుకుంటూ, తెలంగాణ రాష్ట్రం లోని గ్రామాలు అభివృద్ధిలో మరో ఎత్తును
చేరుకుంటున్నాయి. ద్రవ వ్యర్థ యాజమాన్య పద్ధతికి సంబంధించి, మ్యాజిక్ సోక్ పిట్ లను ప్రతీ గ్రామంలో ప్రతీ ఇంటికి తవ్వించడం
జరిగింది. దీనివల్ల వ్యర్థ మురుగు నీరు గ్రామ రహదారులపై పారకుండా భూమిలోకి ఫిల్టర్ మీడియా ద్వారా ఇంకిపోయి, గ్రామాలలో
భూగర్భ జల మట్టం పెరగడానికి దోహదం చేస్తుంది. మ్యాజిక్ సోక్ పిట్లు తవ్వించడం, గ్రామాలలో దోమల బెడద తగ్గడానికి
కారణమయ్యింది. ప్రస్తుతం తెలంగాణా రాష్ట్రం లో ఎన్నో గ్రామాలు సంపూర్ణ పారిశుధ్యాన్ని సాధించి, ఇతర రాష్ట్రాల పర్యాటకులను,
పరిశోధకులను ఆకర్షిస్తూ అభివృద్ధి మార్గంలో మైలు రాళ్ళు గా నిలుస్తున్నాయి.
తెలంగాణా స్వచ్చ ఉద్యమం లో ఎన్నో అవగాహనా కార్యక్రమాలు జరుగుతుండగానే, సంపూర్ణ పారిశుధ్యాన్ని సాధించిన జిల్లాలు
అధికారికంగా ఓడీఎఫ్ జిల్లాలుగా ప్రకటించుకోవటం ప్రారంభమయ్యింది. ప్రస్తుతం రాష్ట్రం లో 11 జిల్లాలు 100 % బహిరంగ మల
విసర్జన నిర్మూలించిన
జిల్లాలున్నాయి. అంతే కాక
2017 సెప్టెంబర్ నెలలో కేంద్ర
పభుత్వం విడుదల చేసిన స్వచ్చ
దర్పణ్ జిల్లా ర్యాంకింగ్స్ లో
తెలంగాణ నుండి రాజన్న
సిరిసిల్ల మరియు జగిత్యాల
జిల్లాలు జాతీయ స్థాయిలో
మొదటి ర్యాంకును
దక్కించుకొని యావత్ తెలంగాణ రాష్ట్రానికే తలమానికంగా నిలిచాయి. ఈ విధంగా ఒక్కొక్క జిల్లా ఓడీఎఫ్ గా ప్రకటించుకోగానే
మిగతా జిల్లాలు సైతం తామేం తక్కువ తినలేదంటూ, శరవేగంగా మరుగుదొడ్ల నిర్మాణాలు చేపట్టడం వల్ల తెలంగాణ రాష్ట్రం ప్రస్తుతం
27% నుండి ఎగబాకి 83% కుటుంబాలకు పారిశుధ్య అవసరాలను తీర్చిన రాష్ట్రం గా మారింది.

స్వచ్చ ఉద్యమంలో గౌరవ శాసన సభ్యుల నుండి మొదలుకొని గ్రామస్థాయిలోని పౌరుడి దాకా అందరినీ కలుపుకుని అందరి
భాగస్వామ్యంతో, 2018 అక్టోబర్ 02 నాటికి సంపూర్ణ పారిశుధ్య రాష్ట్రం గా అవతరించాలనే లక్ష్యం దిశగా తెలంగాణ స్వచ్చ భారత్
మిషన్ వడివడిగా అడుగులేస్తూ ఉంది.

August 2018

Leave a Comment

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s