అద్దం చెప్పే అందమైన అబద్ధం నా మొహం.
అద్దం నా మనస్సులోకి చూడలేక పోతుందా…
లేక
చూపిస్తున్న సత్యాన్ని నేనర్థం చేసుకోలేకపోతున్నానా…?
ఏమో…?
కనిపించే ప్రతీ అందమైన దృశ్యం,
బడబాగ్నులను దాచుకుందేమో…
నీలాకాశ నిర్మలత్వం,
నిటలాక్షుని అగ్నికీలలను కప్పెస్తుందేమో….
నిబ్బరంగా కనిపించే గుండె,
నిరంకుశ పాషాణధ్వానాలను లోలోపల అణచి వేసిందేమో…….
గరళం మింగి నిర్మలంగా నవ్వుతున్న
నీలకంఠుడిని చూసి చూసి…..
త్రిశూలధారియై దుష్టుల దునుమాడాల్సిన కాలరూపుడిని
మర్చిపోయినట్టున్నామ్….
ఈ సహనం కూడా
భూకంపం వచ్చినట్టు,
సునామీ పుట్టినట్టు,
అగ్ని పర్వతం బద్దలయినట్టు…
ఫెటిల్లున పేలిపోతుందా…?
June 2020
Very good depiction of tolerance… Keep it up
LikeLiked by 1 person