ఎన్నినాళ్ళు, ఎన్నిఏళ్ళీ బానిసత్వపు వారసత్వం…..
దించిన తల ఎత్తకుంటే
మదిలో నిప్పులు మండకుంటే…..
అడుగు ముందుకు వేయకుంటే……
తొలగిపోదీ కర్కశత్వం……..
…
మొహం నిండా నవ్వు పంచి
ఆయుధాన్ని వెనక దాచి
సరిహద్దు కావల వాడక్కడ
వాడుచూపిన మాయలొ పడి
వాడువేసే వేటుకోసం
తలలు వంచి మనమిక్కడ……
..
ఈ రాతిరి దాటిపోతే కాంతులేనోయ్ వెలుగులేనోయ్
మెరుపులేనోయ్, జిలుగులేనోయ్,….
అడుగు ముందుకు వేయవోయ్ ఈ గడప దాటి కదలవోయ్…..
…
నోటికాడి ముద్దలను లాగేసె గద్దలనొదలబోం…..
ఇప్పుడిప్పుడే మా రెక్కల కత్తులూ మొలకెత్తుతున్నయ్….
…
కడుపు ఎండి, కళ్ళు మండి కత్తివోలె ఎత్తి నిలచిన
నా శిరసును నీ అరుపుల్ వంచలేవ్……
తాటాకు చప్పుళ్ళకు చెదరిపోయే, బెదరిపోయే
కుందేళ్ళు ఈడలేవ్……
…
కత్తి గాట్లకు తెగిపడేనా ఈ ఎత్తి బిగిసిన పిడికిలి…..
నిశి ఆపగలదా నా కళ్ళను చూడకుండా జాబిలి……
మా గుండెల లోతునుండి
చిలికి చిలికి, ఉబికి ఉబికి ఉరికి ఉరికి
ఉద్యమం వస్తున్నది……
మా గుండెల చప్పుడినవోయ్….
ధడడ ధడడడడ ధడడ ధడడా ఉద్యమం కనబదతది……
…
మా లక్ష్యం చేరె వరకు ఎన్ని చావులకైన సిద్ఢం
ఆగదప్పటివరకు యుద్ధం…..
కడుపుమంటే ఇంధనం మము చేయలేరు బంధనం
గండ్రనిప్పుల మెరపు కత్తుల ఈ తరాన్ని…
రుధిరజ్వాలలు భగ్గుమనెడి, నినాదాలు పిక్కటిల్లెడి మా తరాన్ని
ఆపగలిగేదెవ్వరు…..
ఉరికివస్తాం మైళ్ళకొద్దీ…
నింపివేస్తాం జైళ్ళనన్నీ…..
పలుపుతాళ్ళూ, మందుగుళ్లూ,
ఇనుపముళ్ళూ, బండరాళ్ళూ,,,
ఆపలేర్ మమ్మెవ్వరూ……
ఆపలేర్ మమ్మెవ్వరూ……
……
ఎన్నినాళ్ళు, ఎన్నిఏళ్ళీ బానిసత్వపు వారసత్వం…..
దించిన తల ఎత్తకుంటే
మదిలో నిప్పులు మండకుంటే…..
అడుగు ముందుకు వేయకుంటే……
తొలగిపోదీ కర్కశత్వం……..
June 2010