డిసెంబర్ 31 వ తేదీ రాత్రి 10 గంటలవుతోంది సమయం. మెడికల్ షాపు కు వెళ్దామని బండి మీద వెళ్తుంటే, దాదాపు అన్ని ఇళ్ళలో లైట్లు వెలుగుతున్నాయి. అన్ని ఇళ్ల ముందు ఆడపిల్లలు, మహిళలు టార్చి లైట్లు కొవ్వొత్తులు పట్టుకుని ముగ్గులేస్తున్నారు. చాలా ఇళ్లకు రంగు రంగుల లైట్లు వేసి అలంకరిస్తున్నారు ……… ….
ఒక్కసారిగా బాధేసింది…. కడుపులో దేవినట్టు అనిపించింది…… అసలు నేనున్నది మన దేశంలోనేనా అనిపించింది. అసలు ఏం జరుగుతోంది మన సమాజంలో అనే భావన నన్ను నిలువనీయలేదు.
నాకైతే రెండు అంశాలు మదిలో తోచాయి…….
1. ఇంగ్లీషోడి కొత్త సంవత్సరాన్ని తలదన్నే ఒక పండగను మనం క్రియేట్ చేసుకొని, మన పండగ గొప్పతనాన్ని చెబుతూ, ఇంగ్లీషోడి కొత్త సంవత్సరాన్ని విమర్శిస్తూ ప్రచారం చేయటం….
లేదా
2. ఇంగ్లీషోడి కొత్త సంవత్సరానికి హైందవ సొబగులు అద్ది, దాన్ని మన పండగలో/ధర్మంలో భాగంగా మార్చేయటమే…. … ఈ మాట మనలో చాలా మందికి రుచించదని నాకు తెలుసు…. కానీ మన సంస్కృతిని దెబ్బతీయడం లో ఇంగ్లీషోడి కొత్త సంవత్సరానిది చాలా పెద్ద పాత్ర. దాన్ని జాగ్రత్తగా మన సంస్కృతిలో కలుపుకోవాలంటే…. ఆరోజున దీపాలు వెలిగించాలని చెప్పడం….. లేదా మూఢాల సమయంలో వచ్చేది కాబట్టి ఆరోజున దానాలు చేయాలని ప్రచారం చేయడం…. దానం అనేది అత్యంత గొప్ప కర్మ/క్రియ కాబట్టి ఇంగ్లీషోడి కొత్త సంవత్సరాన్ని మన ధర్మంలోని దానం అనే ప్రక్రియ తో ప్రారంభం చేయాలని చెప్పడం…. దానం చేయకుండా చేసే ఉత్సవాలు పనికిరావని, పరమాత్ముడి దయ కలుగదని ప్రచారం చేయడం …… ఎందుకంటే… బౌద్ధం మన హిందూ ధర్మాన్ని గట్టి దెబ్బ కొట్టినప్పుడు, బుద్ధుడిని 9 వ అవతారం గా ప్రచారం చేసి బుద్ధిజాన్ని మనలో కలుపుకున్నట్టు, ఈ ఇంగ్లీషోడి కొత్త సంవత్సరాన్ని మనం కలుపుకోవలసిందే…. లేదా ఇంగ్లీషోడి మతం మనను కలిపేసుకుంటది……
3. క్రైస్తవం మనమీద చేస్తున్న దాడి నుండి కాపాడుకోవాలంటే,,,, మనను సంస్కరించుకోవాలి, సంరక్షించుకోవాలి … మరో ఆది శంకరుడు వస్తారో రారో తెలియదు…. అప్పటిదాకా ఆగకుండా మన ప్రయత్నం ప్రారంభించాలన్నదే నా ఉద్దేశ్యం. గతం లో కూడా నా పోస్టుల్లో మన ధర్మాన్ని సంస్కరించుకోవాలని నేను వ్రాసి ఉన్నాను.
నేను ఆందోళన తో ఈ పోస్టు వ్రాయట్లేదు….. ఆవేదనతో వ్రాసాను.