Collection from Whatsapp
శ్రీ గురుదత్త ***శ్రీ స్వామీజీ*** జయ గురుదత్త (must read)
సందేహం:స్వామీజీ! స్వామీజీలు బాబాలు పావుకోళ్ళు ధరిస్తారు. పెళ్లిపీటలమీదకి వెళ్తున్న పెళ్ళికొడుకు పావుకోళ్ళు ధరిస్తాడు. కారణం ఏమిటి?
శ్రీ స్వామీజీ సమాధానం:
‘పాదుక’ అంటే పావకోళ్ళు. పాముకోళ్ళు పాంకోళ్ళుగా వ్యవహరింపబడుతున్నాయి. పాదుకల్ని దీక్షాపరులు, సన్యాసులు, బ్రహ్మచారులు మాత్రమే ఉపయోగించాలి. ఎందుకంటే-మన శరీరంలో 72,000 నాడు లున్నాయి. ఈ నాడుల పనితీరుని అధ్యయనం చేయ్యడాన్ని ‘రిఫ్లెక్టాలజీ’ అంటారు.మీరు గమనించే వుంటారు; యోగులు బుడిపెలున్న పాదుకలను మాత్రమే ధరిస్తారు. అందుకు మూడు కారణా లున్నాయి. యోగులలో యోగశక్తి ఆవిర్భవిస్తుంది. భూమి ఒక పెద్ద అయస్కాంతం. పాదుకలు లేకుండా భూమిపై నిలబడితే ‘ఎర్త్’ అవుతుంది. అందువలన బాడ్ కండక్టర్ ఆఫ్ ఎనర్జీ – ఉడ్ తో తయారు చేసిన పాదుకల్ని యోగులు ధరిస్తారు. నేలమీద పడుకున్నప్పుడు ఈ తేడాని గమనించవచ్చు.
కాలివ్రేళ్ళ దగ్గర్నుంచి శిరసు వరకు వ్యాపించివున్న ఈ నాడులు మనిషి ఆలోచనల్ని, ఆవేశాల్ని, కోరికల్ని ప్రభావితం చేస్తాయి. కాలి బొటనవ్రేలు, రెండవవ్రేలులో వున్న నాడిని ‘హస్తి జిహ్వనాడి’ అంటారు. బుడిపెలున్న పాదుకల్ని ధరించినప్పుడు ఈ రెండు వ్రేళ్ళతో బుడిపె దగ్గర నొక్కడం వలన ఈ నాడిపై ఒత్తిడి పెరుగుతుంది. దీనివలన , వీర్యాన్ని ఊర్ద్వ ముఖంలోకి నడిపించడం సాధ్యమవుతుంది. అటువంటి వ్యక్తిని ‘ఊర్ద్వరేతస్కుడు’ అంటారు.
అందువలననే యోగులు, బ్రహ్మచారులు, దీక్షాపరులు మాత్రమే ఈ పాదుకలు ధరించేది. గృహస్తులు ఈ పాదుకలను ధరించరాదు.
స్వామీజీ – “ఏకాక్రియ బహుళార్థకరీ”అంటే ఒక పని చేసి పలు ప్రయోజనాల్ని సాధిస్తారు.స్వామీజీ – మూలికా వైద్యంలో నిష్ణాతులు.స్వామీజీ – చందనంతో, టేకుతో , వేపతో…….పలురకాల పాదుకలు ధరిస్తారు.
ఇక్కడ ముక్యమైన విషయాలు రెండు వున్నాయి.
ఎ) యోగ స్థితి
బి) వాతావరణం
స్వామీజీ ఏ యోగస్థితిలో వుంటే దానికి అనుగుణమైన పాదుకలు ధరిస్తారు.మీరు గమనించే వుంటారు. స్వామీజీ నుదుటి బొట్టు నలుపు రంగులో వుంటుంది. రక్తచందనం , ఔషధాలు కలిపి నూరిన బొట్టు అది. కొద్దిరోజులు ఆ పరిమళం , ఆ ఔషధ గుణం వుంటాయి. స్వామీజీ స్వయంగా తయారు చేసుకుంటారు.
మరొక విషయం.మన హిందూ సంప్రదాయంలో, పెళ్లి పీటలమీదకు వెళ్తున్న పెళ్లికొడుకు ‘పావకోళ్ళు’ ధరిస్తాడు. ఇందుకు రెండు కారణాలున్నాయి:
1) అప్పటివరకు బ్రహ్మచారి. ఒక యవ్వనవతి సరసన కూర్చోబోతున్నాడు. పైపెచ్చు జీలకర్ర బెల్లం పెట్టినప్పుడు , కంకణం కట్టినప్పుడు, ఆ స్పర్శ అతడిలో విచిత్రానుభూతి కలిగించవచ్చు. ఆ స్థితిలో అతడు ఉద్రేకానికిలోను కాకుండా వుండటానికి ముందుగానే పావకోళ్ళతో నడిపిస్తారు.
2) ‘పెళ్ళికళ’ అన్న మాట మీరు వినే వుంటారు. పెళ్ళికుమారుడిలో, పెళ్ళికుమార్తెలో – సాక్షాత్ శ్రీ మహావిష్ణు, శ్రీమహాలక్ష్మి ‘కళ’ కనిపిస్తుంది. ఎంత వికారులయినా ఆ సమయములో చాలా అందంగా కనిపిస్తారు. అందువలనే, పెళ్ళి పీటల మీదకు వెళ్ళే వరుడు పావకోళ్ళు దరించడమన్నది ఆచారంగా వచ్చింది…