సినిమా మేధావులకు సూటి ప్రశ్న

మేదావులైన సినీ పెద్దలు, దర్శకులు, హీరోలకుసూటి ప్రశ్న ! ఈ సమాజం పట్ల మీకు బాధ్యత ఉందా ?మాలాంటి ఏంతో మంది అమాయక ప్రేక్షకులకు ఒక ప్రశ్న మనసులో ఉదయిస్తూ ఉంది….1. మీకు బాధ్యత ఉన్నట్టయితే సమాజం లో కీడు/ దుర్మార్గం పెంచి పోషించే విధంగా ఆశ్లీలతను ఎందుకు చూపిస్తారు…? హీరోయిన్ పాత్రలను, కొన్ని క్యారెక్టర్ లను అత్యంత హేయంగా, కేవలం శృంగారం కోసమే పుట్టినట్టుగా ఎందుకు చూపిస్తున్నారు…? హీరోయిన్ లకు మంచి వేషధారణ గూర్చి మీకు…More

అంధకారం కావాలి

అంధకారం కావాలి అంధకారం…..ఏ వెలుగులు సోకనట్టి అంధకారంఏ కిరణమూ ప్రసరించనట్టి అంధకారం…సంపూర్ణపు అంధకారం కావాలి.నిబిడాంధకారం కావాలి.…ఏ అలజడికి ఆదరని,ఏ చిరుకాంతులకు చెదరని, సంపూర్ణపు అంధకారం కావాలి మది, ప్రకృతి తో లయించేంత అంధకారంబుద్ధి ఏ రకమైన సంబంధమూ ఏర్పర్చుకోలేని అంధకారం….ఏ భయాలూ దరిచేరని అంధకారం… ఆస్పష్ట రేఖలు, రూపులూ, ధ్వనులూ, కల్పనలు….. అన్నీ అస్తిత్వం కోల్పోయేంతటి అంధకారం కావాలి…. ఏ భావనాత్మక సూర్యుడూఉదయించలేనంత అంధకారం కావాలిఅంధకారం కావాలి ప్రశాంతతను మించినదేదో ఈ అంధకారం లో కావాలి.నిర్భావావరణాని కన్నా…More

మౌనం

శ్వేత కాంతి విడిపోయి హరివిల్లుగా మారినట్టుధ్వానాలను గుదిగుచ్చిన చిరుహారం నా మౌనం అంతర్లీన వాయులీనం నా మౌనంనమక చమకాల ఢమరుకం నా మౌనం ఉగ్ర నరసిహుడి భీకర గర్జన నా మౌనంమన్మధుడిని దగ్ధం చేసిన నిటలాక్షాగ్ని నా మౌనం రాముడి ధనుష్ఠంకారం నా మౌనంగజాననుడి ఘీంకారం నా మౌనం అంతరాళ ప్రయాణపు అంతరంగానికి అందనిదిఊహలకు దొరకకుండా మూర్తీభవించినది నా మౌనం కర్ణభేదినా మౌనం శబ్ధాంబుధినా మౌనం స్వప్నావస్తావధినా మౌనం నిర్వికల్ప స్థితి సారథినా మౌనం భావనల సమాధినా…More

వలసకూలీ

ఆకలెరుగక, దప్పికెరుగక, వలసబాటలో గమ్యమెరుగక… వెక్కిరిస్తూ తరుముకొచ్చే ఓటమిని ఒప్పుకోక… కన్నవారికి అయిన వారికీఉన్న ఊరికి దూరమయ్యి… ఆకలెరుగక, దప్పికెరుగక,వలసబాటలో గమ్యమెరుగక… వెక్కిరిస్తూ తరుముకొచ్చేఓటమిని ఒప్పుకోక… నగర దారిలో కత్తుల దారిలోనడచివచ్చిన బాటసారీ… కండలు కరిగించినా,కొండలు నుసి చేసినా,బండలు పగలేసినా…ఎండలో పనిచేసినా… తిండి దొరకని… నగర వీధులగుండె కరగని…. కఠిన మనసులశిథిల దారుల యంత్ర ఊరిలోఉండలేక…. తిరిగి మండలేక…రక్తమోడుతూవలసపక్షుల వలెఊరిగూటికి తిరిగిచేరుకుంటున్నారా….!! వలస కూలీ కన్నవారికి అయిన వారికీఉన్న ఊరికి దూరమయ్యి… ఆకలెరుగక, దప్పికెరుగక,వలసబాటలో గమ్యమెరుగక… వెక్కిరిస్తూ…More

వారు ఎడారిని జయిస్తున్నారు

రాజస్థాన్ అనగానే ఒక రాణాప్రతాప్, ఒక పృథ్వీరాజ చౌహాన్, ఒక పద్మినీ దేవి వంటి వీరులు, శూరులు, గొప్ప చారిత్రక వారసత్వం, పెద్ద పెద్ద కోటలూ, భారతీయ కళలూ గుర్తొచ్చేవి. కానీ పాలకుల ముందుచూపు లేని నిర్లక్ష్యం వల్ల ఇప్పుడు రాజస్థాన్ అంటే రాళ్ళు, ఇసుక, నెత్తిన బిందెల దొంతరలు, నీటి కటకట, బీడు భూములు, పేదరికం, త్రాగునీటి ఎద్దడి, ఎడారులు మాత్రమే మన కళ్ల ముందు కదలుతున్నాయి.                భౌగోళికంగా రాజస్థాన్ రాష్ట్రం భారత…More

గుండె కింద తడి

ఆరనివ్వకు…. ఆరనివ్వకు. అగ్నిని ఆరనివ్వకు…  మథనాగ్నిని …. ……………. మేధో బడబాగ్నిని… వస్తుంటాయ్ …. వస్తుంటాయ్ ….  ఉరికి …… ఉరికి కష్టాల్ ….. కష్టాల్ …..   వస్తుంటాయ్ …….వస్తుంటాయ్ ఉబికి… ఉబికి… కన్నీళ్ళ్ ……   కన్నీళ్ళ్ … …. …. పడనీయకు…. పడనీయకు…  అగ్నిపైన పడనియకు …   ఆరనివ్వకు… అగ్నిని…..  మథనాగ్నిని …… ….. మారనివ్వకు….  మారనివ్వకు….. నిన్నే దహించి వేసే కోపాగ్నిలా…  అసహనాగ్నిలా ……….  ……. ఆరనివ్వకు… అగ్నిలో పడి మథనాగ్నిలో పడి ….. ఆరనివ్వకు… నీ గుండె కింద తడి…More

మనస్సు : ప్రభావం

Whatsapp Collection అనగా అనగా పేరుగాంచిన విలుకాడొకడు ఉండేవాడు. ఒకరోజున అతను తన ధనుస్సును భుజానికి తగిలించుకొని, బాణాలు చేతబట్టుకొని, ఎత్తైన కొండ ఒకదాని మీదికి విహారంగా బయలుదేరాడు. అక్కడ తిరుగుతూ తిరుగుతూ ఉండగా అతనికి చాలా దాహం వేసింది.దగ్గరలోనే ఉన్న చెరువు దగ్గరికి వెళ్ళి, వంగి దోసిలితో నీళ్ళు తీసుకొని కడుపునిండా త్రాగాడు. సరిగ్గా అదే సమయానికి అతనికి నీళ్ళలో పాములాగా ఏదో కదిలినట్లు అనిపించింది. దోసిలిలో ఇంకా మిగిలి ఉన్న నీళ్ళను గబుక్కున వదిలేసి,…More

ఎవరు నేను

Whatsapp Collection కన్న తల్లి కడుపు లోంచి…బయట పడి… తొలి సారి ఊపిరిని..పీల్చిన క్షణం నుంచి…పుడమి తల్లి కడుపు లోకి…చేరు కునేందుకు…ఆఖరి సారి ఊపిరి ని…విడిచి పెట్టడం దాకా సాగే…ప్రస్థానం పేరే…”నేను”.!!!ఈ “నేను”- ప్రాణశక్తి అయిన ఊపిరికి మారు పేరు. ఊపిరి ఉన్నంత దాకా ‘నేను’ అనే “భావన “కొన సాగు తూనే ఉంటుంది.జనన మరణాల మధ్య కాలం లో సాగే జీవన స్రవంతి లో…ఈ ‘నేను’ ఎన్నెన్నో పోకడలు పోతుంది. మరెన్నో విన్యాసాలూ చేస్తుంది.ఈ ‘నేను’ లోంచే…‘నాది…More