Whatsapp Collection
కన్న తల్లి కడుపు లోంచి…
బయట పడి… తొలి సారి ఊపిరిని..పీల్చిన క్షణం నుంచి…పుడమి తల్లి కడుపు లోకి…చేరు కునేందుకు…ఆఖరి సారి ఊపిరి ని…విడిచి పెట్టడం దాకా సాగే…ప్రస్థానం పేరే...”నేను”.!!!
ఈ “నేను”- ప్రాణశక్తి అయిన ఊపిరికి మారు పేరు.
ఊపిరి ఉన్నంత దాకా ‘నేను’ అనే “భావన “కొన సాగు తూనే ఉంటుంది.
జనన మరణాల మధ్య కాలం లో సాగే జీవన స్రవంతి లో…ఈ ‘నేను’ ఎన్నెన్నో పోకడలు పోతుంది.
మరెన్నో విన్యాసాలూ చేస్తుంది.
ఈ ‘నేను’ లోంచే…
‘నాది ’ అనే… భావ’నా పుడు తుంది.
‘నాది’లోంచి…నా వాళ్ళు, నా భార్య, నా పిల్లలు, నా కుటుంబం, నా ఆస్తి, నా ప్రతిభ నా ప్రజ్ఞ, నా గొప్ప…అనేవీ… పుట్టు కొచ్చి చివరికి… ఈ ‘నేను’ అనే భావన… ఈ భూ మండలాన్ని కూడా మించి పోయి…
ఆకాశపు సరిహద్దును కూడా దాటి పోయి…నిలు వెత్తు…విశ్వ రూపాన్ని దాల్చిన ‘అహం’గా ప్రజ్వరిల్లు తుంది.
‘అహం’ అనే “మాయ పొర” కమ్మేసిన స్థితి లో ఈ ‘నేను’ ‘నేనే సర్వాంత ర్యామిని’ అని విర్ర వీగు తుంది.
నాకు ఎదురే లేదని ప్రగల్భాలూ పలుకు తుంది
పంతాలతో పట్టింపులతో, పగలతో ప్రతీ కారాలతో … తన ప్రత్యర్థిని సర్వ నాశనం చేయ డానికీ సిద్ధ పడు తుంది.
బాల్య, కౌమార, యౌవన, వార్ధక్య దశల దాకా విస్ఫు లింగ తేజం తో… విజేతగా నిలిచిన ‘నేను’ అనే ప్రభ… ఏదో ఒక నాడు మృత్యు స్పర్శ తో కుప్ప కూలి పోతుంది.
వంది మాగధులు కైవారం చేసిన శరీరం కట్టె లా మిగులు తుంది.
సుందరీ మణులతో…. మద నోత్సవాలు జరుపు కొన్న… దేహం నిస్తేజంగా పడి ఉంటుంది.
సుఖ భోగాలతో… అష్టైశ్వర్యాలతో తుల తూగిన… ‘నేను’– చుట్టూ చేరిన బంధు మిత్ర సపరి వారపు… జాలి చూపులకు… కేంద్ర బిందువుగా మారు తుంది.
కడ సారి చూపుల కోసం, కొన్ని ఘడియల పాటు ఆపి ఉంచిన… విగత జీవి కి… అంతిమ యాత్ర మొదలవు తుంది.
మరు భూమి లో… చితి మంటల మధ్యే సర్వ బంధనాల నుంచీ విముక్తి కలుగు తుంది.
మొలకు చుట్టిన ఖరీదైన కౌపీనం తో సహా, మొత్తంగా కాలి బూడిద అవు తుంది.
నేనే శాసన కర్తను, నేనే… ఈ భూ మండలానికి అధిపతిని,
“నేనే” జగజ్జేతను”… అని మహోన్నతం గా భావించిన నేను’ లే కుండానే మళ్ళీ తెల్ల వారు తుంది. రోజు మారు తుంది.
ఊపిరి తో మొద లై ఊపిరి తో ఆగిన… “నేను” కథ …అలా… సమాప్త మవు తుంది.
అందుకే… ఊపిరి ఆగక ముందే “నేను” గురించి తెలుసు కో- అంటుంది. భగవద్గీత…
చితి మంటలను చూస్తు న్నప్పుడు… కలిగేది. శ్మశాన వైరాగ్యం మాత్రమే…
అది శాశ్వతం కానే కాదు.
“నేను” గురించిన సంపూర్ణ మైన అవగాహనతో ఉన్నప్పుడే… పరిపూర్ణ మైన వైరాగ్య స్థితి సాధ్యమవు తుంది.
వైరాగ్యం అంటే అన్నీ వది లేసు కోవడం కానేకాదు.
దేని మీదా.. మోహాన్ని కలిగి ఉండక పోవడం, తామరాకు మీద నీటి బొట్టులా జీవించ గలగడం.
స్వర్గ నరకాలు ఎక్కడో లేవు. మన లోనే ఉన్నాయి.
మనిషికి… ఆత్మ దృష్టి నశించి బాహ్య దృష్టి తో జీవించడమే – “నరకం”…
అంతర్ముఖుడై నిత్య సత్య మైన ఆత్మ దృష్టిని పొంద గలగడమే – “స్వర్గం”.
ఈ జీవన సత్యాన్ని తెలియ చేసే దే వేదాంతం.
నిజాయతీగా,
నిస్వార్థంగా,
సద్వర్తనతో,
సచ్ఛీలతతో
భగవత్ ధ్యానం తో జీవించ మనే ‘దే వేదాంత సారం.
‘అహం బ్రహ్మాస్మి’- ‘అంటే ‘- ‘అన్నీ నేనే’ అనే స్థితి నుంచి… ‘త్వమే వాహమ్’… అంటే- ‘నువ్వే “నేను’ అని… భగవంతుడి పట్ల చిత్తాన్ని నిలుపు కోగల తాదాత్మ్య స్థితిని చేరు కోగలిగి తేనే…
మానవ జన్మకు సార్థకత సిద్ధిస్తుంది..!
లోకా స్సమస్తా స్సుఖినో భవంతు
సర్వే జనా స్సుఖినో భవంతు
నువ్వే నేను అనుకోవడం కూడా అహంకారానికి నిదర్శనం గా మారవచ్చు–నేను త్వమేవాహం గూర్చి చెపుతున్న
LikeLiked by 1 person
okasaari choosi mallee chepta
LikeLiked by 1 person