అంధకారం కావాలి అంధకారం…..
ఏ వెలుగులు సోకనట్టి అంధకారం
ఏ కిరణమూ ప్రసరించనట్టి అంధకారం
…
సంపూర్ణపు అంధకారం కావాలి.
నిబిడాంధకారం కావాలి.
…
ఏ అలజడికి ఆదరని,
ఏ చిరుకాంతులకు చెదరని,
సంపూర్ణపు అంధకారం కావాలి
మది, ప్రకృతి తో లయించేంత అంధకారం
బుద్ధి ఏ రకమైన సంబంధమూ ఏర్పర్చుకోలేని అంధకారం….
ఏ భయాలూ దరిచేరని అంధకారం…
ఆస్పష్ట రేఖలు, రూపులూ, ధ్వనులూ, కల్పనలు….. అన్నీ అస్తిత్వం కోల్పోయేంతటి అంధకారం కావాలి….
ఏ భావనాత్మక సూర్యుడూ
ఉదయించలేనంత అంధకారం కావాలి
అంధకారం కావాలి
ప్రశాంతతను మించినదేదో ఈ అంధకారం లో కావాలి.
నిర్భావావరణాని కన్నా గొప్పదేదో ఈ అంధకారం లో కావాలి.
….
కావాలి…
ఇప్పుడు మనస్సుకు అలాంటి అంధకారమే కావాలి…
