సినిమా మేధావులకు సూటి ప్రశ్న

మేదావులైన సినీ పెద్దలు, దర్శకులు, హీరోలకు
సూటి ప్రశ్న !

ఈ సమాజం పట్ల మీకు బాధ్యత ఉందా ?
మాలాంటి ఏంతో మంది అమాయక ప్రేక్షకులకు ఒక ప్రశ్న మనసులో ఉదయిస్తూ ఉంది….
1. మీకు బాధ్యత ఉన్నట్టయితే సమాజం లో కీడు/ దుర్మార్గం పెంచి పోషించే విధంగా ఆశ్లీలతను ఎందుకు చూపిస్తారు…? హీరోయిన్ పాత్రలను, కొన్ని క్యారెక్టర్ లను అత్యంత హేయంగా, కేవలం శృంగారం కోసమే పుట్టినట్టుగా ఎందుకు చూపిస్తున్నారు…? హీరోయిన్ లకు మంచి వేషధారణ గూర్చి మీకు ఆలోచనే రాదా…?
2. సమాజంలో గొప్ప గొప్ప స్త్రీ మూర్తులు లేరా…? వాళ్ళ లాంటి పాత్రలను ఎందుకు హైలైట్ చేయరు…?
3. హీరో పాత్రను మిత్రుల మధ్యలో కుర్చుని మందు కొట్టి, తల్లిదండ్రులను తిడుతున్నదృశ్యాలను ఎందుకు చూపిస్తారు ? మీకు బాధ్యత లేదా…? మద్యం తాగడాన్ని మీరు యువతలో ప్రోత్సహిస్తున్నట్టు కాదా…?
4. సినిమాల వల్లనే ఇవాళ పెళ్ళిచూపులలో అమ్మాయి తో , అబ్బాయి ఏకాంతంగా మాట్లాడే ఒక దుష్ట సంప్రదాయం ఏర్పడ్డమాట నిజం కాదా..? సినిమాల వల్లనే ఇరవై ఏళ్లయినా నిండని యువత, ఒకరిని ఒకరు చంపుకోవడం, లైంగికంగా వేధించుకోవడం నిజం కాదా… ?
5. సినిమాల వల్లనే ఇవాళ స్కూలు కెళ్ళే అబ్బాయిలు సైతం, అమ్మాయిలను, మహిళా టీచర్లను ఏడిపించడం, వాళ్ళను ఒక శృంగార వస్తువుగా చూడటం నిజం కాదా…?
6. అడ్డమైన అశ్లీల దృశ్యాలు సినిమాల్లో పెట్టి వాటివల్ల సమాజం పాడైపోతూ ఉంటె నిమ్మకు నీరెత్తినట్టు కూర్చుని, సమాజం పట్ల మాకేం బాధ్యత లేనట్టు కూర్చుంటారా…?
7. సమాజం లో పెరిగిపోయిన హింస, అపనమ్మకం, రక్తపాతం … వీటన్నింటి పట్ల మీకు బాధ్యత లేదా…?

ఇప్పటికైనా కళ్ళు తెరవండి…. మునిగిపోతున్న సమాజంలో మానవీయ విలువలు పెంచేందుకు తోడ్పడండి…. మీ చేతిలో ఉన్న ఒక శక్తివంతమైన ఆయుధం సినిమా… దాన్ని కొంచెమైనా మిమ్మల్ని పోషిస్తున్న సమాజం కోసం వాడండి….. లేకపోతె… ఎదో ఒకరోజు ఈ సమాజం మీ అందరిని వెతికి వెతికి వెనకబడి శిక్షించక మానదు.

Slave Handcuffs (ca.1938) by Stanley by National Gallery of Art is licensed under CC-CC0 1.0

పంచాయతీ కార్యదర్శికి ప్రత్యక్ష నరకం – పార్ట్ 1.

పంచాయతీ కార్యదర్శులు ఎదుర్కొంటున్న సమస్యలను అందరికి తెలియచెప్పే ఉద్దేశ్యం ఇది. వారి ఇబ్బందులను సహృదయంతో అర్థం చేసుకునే ప్రయత్నం ఇది .

Loading…

Something went wrong. Please refresh the page and/or try again.

Leave a Comment

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s