వేదం విశిష్టత 2

పార్ట్ 2 వేదము వజ్రాదపి కఠోరాణి   మృదూని కుసుమాదపి లోకోత్తరాణాం చేఁ తాంసి కోహి విజ్ఞాతు మర్హసి మహాత్ముల హృదయాలు వజ్రముకన్నకఠోరాలు పూలకంటే సుకుమారాలు ఈ విధంగా అతి విచిత్రాలైన మహాత్ములయొక్క హృదయాలు. ఎవడు గుర్తింపగలడు ! ప్రత్యక్షేణాను  మిత్వావా  యస్థూపాయో న బుద్ధ్యతే ఏతం విదంతి వేదేన తస్మాద్వే దస్య వేదతామానవులు దైనందిన జీవితంలో మునిగి తమకుతోచిన విధంగా ఆ యా పనులను నిర్వర్తిస్తూ వుంటారు యిది కర్తవ్యమ్ యిది అకర్తవ్యం యిది ధర్మం యిది అధర్మం  అని నిర్ణయించు కోలేరు.  ధర్మాలను కంటితో చూచిగాని బుద్దితో ఊహించిగాని తెలుసుకోవడం కష్టం అట్లే…More