పార్ట్ 2
వేదము
వజ్రాదపి కఠోరాణి మృదూని కుసుమాదపి
లోకోత్తరాణాం చేఁ తాంసి కోహి విజ్ఞాతు మర్హసి
మహాత్ముల హృదయాలు వజ్రముకన్నకఠోరాలు పూలకంటే సుకుమారాలు ఈ విధంగా అతి విచిత్రాలైన మహాత్ములయొక్క హృదయాలు. ఎవడు గుర్తింపగలడు ! ప్రత్యక్షేణాను మిత్వావా యస్థూపాయో న బుద్ధ్యతే ఏతం విదంతి వేదేన తస్మాద్వే దస్య వేదతామానవులు దైనందిన జీవితంలో మునిగి తమకుతోచిన విధంగా ఆ యా పనులను నిర్వర్తిస్తూ వుంటారు యిది కర్తవ్యమ్ యిది అకర్తవ్యం యిది ధర్మం యిది అధర్మం అని నిర్ణయించు కోలేరు. ధర్మాలను కంటితో చూచిగాని బుద్దితో ఊహించిగాని తెలుసుకోవడం కష్టం అట్లే ఈశ్వర తత్త్వాన్నికూడా తెలుసుకోలేము అంతేకాదు తత్ప్రాప్తికి సాధనాలు గూడ గుర్తించలేము ఇట్టి సాధనాలను వేద సహాయం చేత మాత్రమే తెలుసుకొనగలుగుతాము అని భారతీయ సాంప్రదాయం కాబట్టే ” వేదయతీతి వేదః ” అనివేదమునకు సార్థక నామం
వేదము అనేగాక ఋషి: శ్రుతి : ఆమ్నాయ : బ్రహ్మ స్వాధ్యాయ : స్వాహా భారతీ శ్రీ : మొదలగు అనేక నామధేయాలతో వేదం విరాజిల్లుతూ వుంది వేదం అనేది ఒక విజ్ఞాన సర్వస్వము. వేదానికిగల ఒక్కొక్క పేరు వేదగత విశిష్ట తత్త్వాన్ని తెయజేస్తూ ఉంటుంది ధర్మ బ్రహ్మ తత్త్వా లను నిరూపించటానికి బయలుదేరింది వేదము. అందుచేతనే ” ఏక వేదస్య చా ఙ్ఞానాత్ వేదాస్తే బహవో 2 భవన్ “
పరమేశ్వరునికి. వేదః అని సార్థకనామధేయం ఈఒక్క వేదస్వరూపాన్ని పరమేశ్వరతత్త్వాన్ని తెలియజేయటానికే శాఖోప శాఖలతో వేదమనే మహావృక్షము ఆవిర్భవించినది వేదాన్ని శతపథమని కూడా అంటారు