నే….! నేను మాట్లాడకపోతే ఈ ప్రపంచం మూగవోతుంది నేను కదలకపోతే ఈ జగం నిశ్చలమవుతుంది నేను వినకపోతే ఈ లోకం వేదన అరణ్యరోదనవుతుంది నేను చూడకపోతే వెలుగు చీకటయిపోతుంది నేను శాసించకపోతే గాలులు స్తంభించిపోతాయి నేను అనంతాన్ని…నేను దిగ్దిగంతాన్ని నేను తరంగాన్ని… నేను కీమ్మీరపు గాలి తెమ్మెరను నేను రేణువును… గోపగోపికా కోపతాప స్వాంతనపు వేణువును నేను భావాన్ని… పక్ష్యాదుల కిలకిలారావాన్ని నేను జగత్తును… నేనే మహత్తును నేను మరచిపోబడ్డ గతాన్ని…. నేను దద్దరిల్లుతున్న ఉద్యమకారుడి స్వగతాన్ని…More
Monthly Archives: November 2020
మన విద్య
మన విద్య అదేమిటో మా తాత తిన్న నేతి వాసన నా మూతి లోనుండి వస్తుందట… విద్యాధికులందరినీ చూడబోతే భారతీయులలాగే కనబడుతుంటారట ….. స్మశానంలో తిరిగి తిరిగి.. శివుడి కొరకు వెతికినట్టు విద్య పుట్టిన దేశం లో మన విలువలు ,వెలుగులు వెతకాలట… బోధాయనుడెవ్వడో ఎవడికి కావాలట… మార్కులొచ్చే “పైథాగరస్” వస్తే సరిపోతుందట ….. కణ్వుడు,శుశ్రుతుడు , భరద్వాజ, బ్రహ్మగుప్త,మిహిరుడు , ఆర్యభట్ట.. .. విద్వాంసుల విజ్ఞాన శాస్తవతంసుల ఆత్మలన్నీ కలిసి ఇప్పుడు మళ్లీ మళ్ళి ఆత్మహత్య…More