మన విద్య

మన విద్య

అదేమిటో మా తాత తిన్న నేతి వాసన నా మూతి లోనుండి వస్తుందట... 
విద్యాధికులందరినీ చూడబోతే
భారతీయులలాగే కనబడుతుంటారట .....
 
స్మశానంలో తిరిగి తిరిగి.. 
 శివుడి కొరకు వెతికినట్టు 
విద్య పుట్టిన దేశం లో 
మన విలువలు ,వెలుగులు వెతకాలట...  

బోధాయనుడెవ్వడో 
ఎవడికి కావాలట... 
మార్కులొచ్చే "పైథాగరస్" 
 వస్తే  సరిపోతుందట .....
కణ్వుడు,శుశ్రుతుడు , భరద్వాజ,
బ్రహ్మగుప్త,మిహిరుడు , ఆర్యభట్ట.. .. 
విద్వాంసుల విజ్ఞాన శాస్తవతంసుల 
ఆత్మలన్నీ కలిసి ఇప్పుడు 
మళ్లీ మళ్ళి ఆత్మహత్య చేసుకోక తప్పదంట .... 
 
ఏదయినా ఇంతేనోయ్ 
 పైన వెలుగు లోనుండదు 
కలుగులోన ఎలకుండదు
తప్పదింక తవ్వడం 
కొండలను వెతకడం.. 
లేనిపోని విలువలకై  
 జల్లెడతో కొలవడం
కనబడని వలువలను
దారాలతో అల్లడం .. .. 

 విద్యంటే పిండి మర -తిప్పాలట గిర గిరా 
బట్టి బాగా పట్టగల- దేశాన్ని తిట్టగల 
 బొమ్మలను వెలికి తెచ్చి - పత్రాలను చేతికిచ్చి 
కొత్తవాణ్ణి మరను వేయ 
ఊరంతా వెతకాలట ప్రచారాలు చేయాలట.. 

హిమవన్నగ శిఖరమంత 
కీర్తి కరిగి పోతుంటే 
 నిఖార్సయిన విలువలన్నీ 
నీట కలిసి పోతుంటే 
.. .. .. 
వరదనీరు తాకకుండా 
కాలికి తడి అంటకుండా 
విదేశీ విద్యలతో టక్కు టమార మాయలతో 
వంతెనలను కడతారట 
.. .. .. 
 మునిగి పోయి చూస్తే తప్ప 
అంతు తెలియలేనట్టి 
భారతీయామృతపు లోతును 
వంతెనపై నిలుచుండి 
అంచనాలు వేస్తారట... ..    
...... 
అదేమిటో మా తాత తిన్న నేతి వాసన 
 నా మూతి లోనుండి వస్తుందట... 

2016

Leave a Comment

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s