భారత్ నిలచింది

భారత్

భారత్ నిలిచింది

జయ గీతిక పాడింది

నడకలు నేర్పింది

మోక్ష పదమును చూపింది.

……………………………… ||భారత్ నిలిచింది ||

విషపునాగును తాడుగా చేసి,

కొండను తెచ్చి కవ్వము జేసి,

పాల సంద్రమును చిలికినప్పుడే…

హాలాహలము భరించినప్పుడే

అమృతమొచ్చింది…

దైవత్వమ్మును తెచ్చింది

……………………………………… ||భారత్ నిలిచింది ||

గుండుకు గుండెను అడ్డుపెట్టితే

దేహముపై లాఠీలు ఆడితే

ఉరికొయ్యల ఉయ్యాలలూగితే…

అహింసతో నిటలాగ్నిరేపితే

స్వతంత్రమొచ్చింది

మనకు స్వరాజ్యమొచ్చింది.

……………………………………… ||భారత్ నిలిచింది ||

యుద్ధపిపాసులు, బద్ధ విరోధులు

ప్రజలందరిలో అశాంతి పెంచగ

వీరము ఇదియంటూ ధర్మ వీరము చూపింది యోగము చూపింది

భారత్ త్యాగము నేర్పింది

భారత్ నిలిచింది…

……………………………………… ||భారత్ నిలిచింది ||

సమాచారమున సవ్యసాచిగా

ఔషధి వైద్యములో విరించిగా

వైజ్ఞానికత లో జగద్గురువు గా

విశ్వమానవ విజయ గీతికై…

భారత్ ఎదిగింది….

……………………………………… ||భారత్ నిలిచింది ||

మానవాళికి మార్గదర్శిగా,

ఆధ్యాత్మికత కు చివరి మలుపుగా

లోకమంతటికి భగవద్గీత గా

భారత్ నిలిచింది…

ప్రపంచానికే

ప్రాణజ్యోతిగా భారత్ ఒదిగింది..

భారత్ నిలిచింది…

……………………………………… ||భారత్ నిలిచింది ||

Leave a Comment

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s