ఎందుకో మా పాఠశాల ను చూస్తే
నాకు నా దేశమే గుర్తొస్తుంది ............ ................
కష్టపడే పంతుళ్ళు ....
నిక్కచ్చిగా పన్నులు కట్టే మధ్య తరగతి జీవుల్లాగా...
బడికేరాని నిర్లక్ష్యపు పోరగాళ్ళు .....
పార్లమెంటులోని కొందరు నాయకుల్లాగ....
చదవగలిగే అవకాశం లేని పిల్లలు......
పబ్లిక్ సర్వీస్ కమిషన్ మోసానికి బలయ్యే అభ్యర్థుల్లాగా.. .....
॥ ఎందుకో మా పాఠశాల॥
పోట్లాడటానికి వచ్చే పిల్లల తలిదండ్రులు .....
పనికి రానివి ప్రచారం చేసే మీడియా లాగా....
పట్టించుకోబడని మరుగుదొడ్లు ....
డబ్బులేక్కువై నేరాలు చేసే నగర యువత లాగా..
సగమే కట్టబడ్డ ప్రహరీగోడ ....
నకిలీ ఆయుధాలు పట్టుకున్న పోలీసుల లాగా... ......
॥ ఎందుకో మా పాఠశాల॥
వైర్లున్నా రాని కరంటు .....
సముద్రం లో వృధాగా కలిసిపోయే నదీ నీళ్ళ లాగా
అలంకారప్రాయమైన కంప్యూటర్లు.....
గోదాముల్లో మగ్గిపోయి ప్రజలకు పంచబడని ధాన్యం లాగా...
పాఠశాల కొచ్చినా పాఠాలు చెప్పని ఒకరిద్దరు పంతుళ్ళు .....
చదువురాకున్నా మంత్రులయిపోయిన వాళ్లలాగా.......
.... .... ..... ..... ఎందుకో మా పాఠశాల ను చూస్తే
నాకు నా దేశమే గుర్తొస్తుంది
(మే 2013)
Like this:
Like Loading...
Related
Great writings…👏👏👏
LikeLike