అవును
కాలమనే పేరు పెట్టుకున్న
గడియారానికి దయలేదు
టిక్కు టిక్కుమంటూ
నా కాలాన్ని లాగేసుకుంటోంది.
సహజమైన నా ప్రకృతిని,
నా కాలాన్ని...
కృత్రిమంగా వచ్చి అంటగట్టేసుకుంది
తన టిక్కు టిక్కు ల మధ్య
నా కాలాన్ని, జీవితాన్ని
బందీ చేసింది
ప్రాణమే లేని తనకూ,
రక్త మాంసాలు కొడిగట్టిపోతున్న నాకు
మధ్య ఇది పరుగు పోటీ లాగే ఉంది....
నిశ్చలంగా ఉండి చలింపజేసే తనకూ
భావోద్వేగాల చలనశీలినైన నాకు
నిత్యం యుద్ధమే...
శూన్యం నుండి శూన్యానికి పరిగెత్తే తనూ
భవబంధాల కాలి సంకెళ్లతో నేను..
దైనందిన పోరాట సహజీవనమే ఇది .......
ప్రపంచాన్నంతా బంధించేసింది
తనతో పాటు పరుగెత్తుతున్నవాడు నిలుస్తున్నాడు
లేకపోతే తనలోనే (కాలం లో) కలుస్తున్నాడు
తనలో లయించడమే తప్ప
తనను జయించడమంటూ ఉండదేమో
రోజురోజుకూ సాంకేతికత పెరిగి పెరిగి
గడియారం నిర్దయగా మారిపోతోంది.
హసన్ముఖి
సెప్టెంబర్ 2020
Like this:
Like Loading...
Related