భారత స్వాతంత్ర పోరాటం లో అసువులు బాసిన అమర వీరుడు.
జననం : 26 డిసెంబర్ 1899 మరణం :: 31 జూలై 1940 పంజాబ్ లోని సూనం జిల్లాలో జన్మించారు. 9 ఏళ్ళ వయస్సు వచ్చేసరికే తల్లిదండ్రులు ఇద్దరూ మరణించారు. అమృత్ సర్ లో అనాధ శరణాలయం లో పెరిగారు. .
1919 ఏప్రిల్ 13 న జలియన్ వాలా బాగ్ లో సమావేశమైన వారిపై ముందస్తు హెచ్చరికలు లేకుండా కాల్పులు జరిపి 379 మందిని కాల్చిచంపిన ఘటన ఉధం సింగ్ మనసులో నాటుకుపోయింది. ఆ సమయం లో పంజాబ్ గవర్నర్ గా ఉన్న మైకెల్ ఓ డయర్ కాల్పులను సమర్థించడాన్ని జీర్ణించుకోలేక పోయాడు.
1924 లో విదేశాలకు వెళ్ళి గదర్ పార్టి లో చేరాడు. 1927 లో, భగత్ సింగ్ బృందం కోసం విదేశాలనుండీ తుపాకులు బుల్లెట్లుతీసుకుని వచ్చి అరెస్ట్ అయ్యాడు. 1931 లో విడుదల అయ్యి కాశ్మీర్ కు మకాం మార్చాడు. 1934 లో పోలీసుల కళ్ళు గప్పి జర్మనీ చేరుకున్నాడు.
1940 వరకూ ఓపికగా ఎదురు చూసి, అవకాశం రాగానే, మార్చ్13 న లండన్ కాక్స్ టన్ హాల్ లో ఓడయర్ ప్రసంగం ఉందని తెలిసి, ఒక పుస్తకం లో రివాల్వర్ దాచుకుని వచ్చి ఓ డయర్ ను కాల్చి చంపాడు. తద్వారా భారతీయుల స్వాతంత్ర కాంక్ష ఎంత బలీయమైనదో ప్రపంచానికి చాటాడు. 1940 జులై 31 వ తేదీ న భారతీయ ముద్దు బిడ్డకు పెంటన్విల్లే జైలులో ఉరిశిక్ష అమలు చేసారు.
హసన్ముఖి