జతిన్ బాఘా

భారత స్వాతంత్ర పోరాటం లో అసువులు బాసిన అమర వీరుడు

జననం 7 డిసెంబర్ 1879 
మరణం 10 సెప్టెంబర్ 1915

బాఘా అంటే పులి అని అర్థం …. 
అసలు పేరు జతీంద్రనాథ్ ముఖోపాధ్యాయ బ్రిటిష్ ఇండీయా లో బెంగాల్ లోని  నాడీయా జిల్లాలోని కుశ్లియా గ్రామంలో జన్మించాడు. పసి ప్రాయంలోనె తండ్రిని కోల్పోయాడు.. జతిన్ మీద పెద్దమ్మ (వినోదిబాల, ప్రముఖ రచయిత్రి) ప్రభావం చాలా ఉంది.. 
ఉన్నత చదువుల కోసం కలకత్తా వెళ్ళినపుడు స్వామి వివేకానంద ను కలిసాడు. స్వామీజి ప్రభావం వల్ల, మానసికంగా, శారీరకంగా పటిష్టంగా తయారయ్యాడు. ఒకవైపు స్వామీజి తో, మరో వైపు విప్లవ సంఘాలతో సాన్నిహిత్యం పెరిగింది. ఒకసారి స్వంత గ్రామం వద్ద గల అడవిలో పులితో పోరాడి, అందరి ముందు పులిని చంపడం చూసి బాఘా అని పిలవడం ప్రారంభించారు.
1900 లో ‘అనుశీలన్ సమితి’ అనే రహస్యసంస్థను ప్రారంభించారు. యుగంతర్ పార్టీ లో ప్రధానమైన నాయకుడిగ పనిచేసాడు.. ఒకవైపు శ్రీ అరవిందో తో కలసి పనిచేస్తూ , మరోవైపు దేవఘర్ వద్ద బరీంద్రనాథ్ ఘోష్ తో కలసి బాంబు ఫ్యాక్టరీ ప్రారంభించారు. స్వతంత్రంగా పనిచేస్తు కేంద్ర సంఘానికి అనుబంధంగా ఉండే.. ప్రాంతీయ నెట్ వర్క్ బీహార్, బెంగాల్ ఒడిషా లలో ఏర్పరచాడు. 
తన మొదటి సంతానం మూడేళ్ళ కే  చనిపోవడంతో,  మానసికంగా ప్రశాంతతను పొందడానికి ఉత్తర భారత యాత్రలు చేసి, స్వామీ భోలానంద గిరి, స్వామీ నిరాలంబ ను కలుసుకుని తన లక్ష్యాన్ని మరింత  మెరగుపర్చుకున్నాడు.   
బ్రిటిష్ వారు జతిన్ పై 46 రకాల కేసులు పెట్టారు. మొదటి ప్రపంచ యుద్ధం లో జర్మనీ తో కలసి బ్రిటిష్ ఇండియా పై దాడి చేసి స్వాతంత్ర్యం తేవాలని పథకం రచించారు జతిన్ బాఘా. 
రాస్ బిహారీ బోస్ తోను అమెరికాలోని గదర్ పార్టి నాయకులతో కలసి ఈ పథకం అమలు చేయాలని ప్రయత్నించాడు. జర్మనీ తో ఒప్పందం కుదుర్చుకున్నారు.  జర్మనీ నుండి ఆయుధాల నౌక చేరుకునే ముందు, బ్రిటిష్ వారు రెండు వేల మంది తో జతిన్ ను చుట్టుముట్టారు. వారితో పోరాడుతూ బాలాసోర్ వద్ద జతిన్ వీర మరణం పొందాడు.
  
చార్లెస్ టెగహర్ట్ అనే ఆంగ్లేయ పోలీసు అధికారి జతిన్ గూర్చి లేఖ రాస్తూ, జతిన్ బ్రిటీషు వాడై పుట్టి ఉంటే, లండన్ లో ట్రాఫల్ఘర్ స్క్వేర్ లో విగ్రహం పెట్టె వాళ్ళం అని అభిప్రాయపడ్డాడు. ఇది ఒక్కటి చాలు జతిన్ వీరత్వం బ్రిటీషు వారిని ఎంతగా భయపెట్టిందో మనకు అర్థం అవడానికి.  

హసన్ముఖి

పంచాయతీ కార్యదర్శికి ప్రత్యక్ష నరకం – పార్ట్ 1.

పంచాయతీ కార్యదర్శులు ఎదుర్కొంటున్న సమస్యలను అందరికి తెలియచెప్పే ఉద్దేశ్యం ఇది. వారి ఇబ్బందులను సహృదయంతో అర్థం చేసుకునే ప్రయత్నం ఇది .

అవినీతి – పార్ట్ 2

అవినీతి ఎందువల్ల, ఎవరివాళ్ళ ఉత్ప్రేరితమవుతుంది.. అనే అంశాలను ఈ వ్యాసం లో చర్చిస్తున్నాం. దీనిని పెంచి పోషించే అవసరం ఎవరికుంది..? ఎందుకుంది..? మనం ఏం తెలుసుకోవాలి.. దీన్ని అంతమొందించాలంటే.. ఎలాంటి అడుగులేయాలి….

ఉద్ధం సింగ్

దేశం కోసం ప్రాణాలు పణం గా పెట్టి పోరాడిన అమరుల గూర్చి, నిజమైన దేశభక్తుల గూర్చి ఈ తరం వారికి తెలియజేయాలని ఈ ప్రయత్నం…..

దయలేని గడియారం

సాంకేతికతతో తనను తాను బంధించుకున్న మానవుడికి, సంపాదన కోర్కెలతో తనను తాను ఉరి వేసుకుంటున్న మానవుడికి, కాలం అనే గడియారం లో ఎలా ఇరుక్కు పోయాడో తెలియడం లేదు…

మా స్కూలు

పాఠశాల-పార్లమెంటు ఈ రెండు అత్యంత ముఖ్యమైనవి. దేవాలయాల వలె పవిత్రమైనవి. కానీ ఈ రెండింటినీ నిర్లక్ష్యం చేయబడ్డ పరిస్తితులలో వ్రాసుకున్న కవిత

రైలు-బతుకు

చుకు చుకు చుకు చుకు తిరిగెర తిరిగెర జీవన చక్రం దేశీ బతుకుల సజీవ చిత్రం || చుకు చుకు || సీటుకోసమే దేవులాటలు సీటు దొరకక పీకులాటలు దొరికిన వెంటనే పక్కవాడితో సర్దుబాటుకై వాదులాటలు || చుకు చుకు || రణగొణ ధ్వనులు, గడబిడ సడులు దడ దడ లాడే రైలు అడుగులు మెతుకుల…

స్వాతంత్ర సిద్ధి తరువాత గ్రామీణాభివృద్ధి

అసలు గ్రామాలను అభివృద్ధి చేయడం అంటే ఏమిటి…? గ్రామాలను గ్రామాలలాగే అభివృద్ధి చేయడమా…? గ్రామాలను పట్టణాలలాగా అభివృద్ధి చేయడమా…? పట్టణాలలాగా అభివృద్ధి చేస్తే, మరి మూలాధారమైన వ్యవసాయమూ, వృత్తులు అన్నీ ఏమైపోతాయి…? మరి గ్రామాలలాగే ఉండిపోతే వారి అవసరాలను అర్థం చేసుకుని సదుపాయాలను కల్పించడం ఎలా…?             దేశ జి‌డి‌పి లో ప్రాథమిక రంగం పూర్తిగా…

Leave a Comment

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s