మాలో ఒకడు

మా అందరితో కలసి నడుస్తుంటే మాలో ఒకడివనుకున్నాం మాతోపాటే ఉండి నువ్వు వెనకగా నడుస్తూ మిగిలిన వాళ్ళను ముందుకు నడిపిస్తూ ఉంటే, మా లోనే వెనకబడినవాడివేమో అనుకున్నాం కొంచెం దూరం నడిచాక మా కన్నా ఎంతో ముందు నువ్వు మిగతా వాళ్లందరితో కలసి కనిపిస్తే…. ఆశ్చర్యపడి … సరేలే మా కన్ను గప్పి ఎప్పుడో ముందుకు పరిగెట్టుకుంటూ వెళ్ళావనుకున్నాం…….. దారిపక్కనున్న చెట్టెక్కి చూస్తే చుట్టూ పక్కల ఉన్న ఊళ్ళన్నీ నీ కోసం కదిలొస్తున్నాయని తెలిసీ … ఒకింత…More

సహనం

అద్దం చెప్పే అందమైన అబద్ధం నా మొహం. అద్దం నా మనస్సులోకి చూడలేక పోతుందా… లేక చూపిస్తున్న సత్యాన్ని నేనర్థం చేసుకోలేకపోతున్నానా…? ఏమో…? కనిపించే ప్రతీ అందమైన దృశ్యం, బడబాగ్నులను దాచుకుందేమో… నీలాకాశ నిర్మలత్వం, నిటలాక్షుని అగ్నికీలలను కప్పెస్తుందేమో…. నిబ్బరంగా కనిపించే గుండె, నిరంకుశ పాషాణధ్వానాలను లోలోపల అణచి వేసిందేమో……. గరళం మింగి నిర్మలంగా నవ్వుతున్న నీలకంఠుడిని చూసి చూసి….. త్రిశూలధారియై దుష్టుల దునుమాడాల్సిన కాలరూపుడిని మర్చిపోయినట్టున్నామ్…. ఈ సహనం కూడా భూకంపం వచ్చినట్టు, సునామీ పుట్టినట్టు,…More