మారిన దేశ కాల పరిస్తితులలో తన ధర్మాన్ని రక్షించుకునేందుకు తపన పడుతున్న వీరుడి అంతరంగం More
రైలు-బతుకు
చుకు చుకు చుకు చుకు తిరిగెర తిరిగెర జీవన చక్రం దేశీ బతుకుల సజీవ చిత్రం || చుకు చుకు || సీటుకోసమే దేవులాటలు సీటు దొరకక పీకులాటలు దొరికిన వెంటనే పక్కవాడితో సర్దుబాటుకై వాదులాటలు || చుకు చుకు || రణగొణ ధ్వనులు, గడబిడ సడులు దడ దడ లాడే రైలు అడుగులు మెతుకుల కోసం పరిగెడు బతుకులు బతుకుల నిండా అతుకుల గతుకులు || చుకు చుకు || టిప్పుటాపుగా సూటుబూటుతో కిటికీ పక్కన…More
స్వాతంత్ర సిద్ధి తరువాత గ్రామీణాభివృద్ధి
అసలు గ్రామాలను అభివృద్ధి చేయడం అంటే ఏమిటి…? గ్రామాలను గ్రామాలలాగే అభివృద్ధి చేయడమా…? గ్రామాలను పట్టణాలలాగా అభివృద్ధి చేయడమా…? పట్టణాలలాగా అభివృద్ధి చేస్తే, మరి మూలాధారమైన వ్యవసాయమూ, వృత్తులు అన్నీ ఏమైపోతాయి…? మరి గ్రామాలలాగే ఉండిపోతే వారి అవసరాలను అర్థం చేసుకుని సదుపాయాలను కల్పించడం ఎలా…?
దేశ జిడిపి లో ప్రాథమిక రంగం పూర్తిగా తగ్గిపోయిందని అన్నీ రకాల నివేదికలూ వేలెత్తి చూపిస్తున్న ప్రస్తుత తరుణంలో, వ్యవసాయ మరియు అనుబంధ రంగాలకు ఊతం ఇచ్చే కార్యక్రమాలను, ఆర్థిక, సామాజిక స్వావలంబన కలిగించే కార్యక్రమాలను, గ్రామీణుల అవసరాలకు తగ్గట్టుగా గ్రామీణాభివృద్ధి పథకాలను రూపొందించడం ప్రస్తుత ప్రధానమయిన అవసరం.More
భారత్ నిలచింది
భారత్ నిలిచింది జయ గీతిక పాడింది నడకలు నేర్పింది మోక్ష పదమును చూపింది. ……………………………… ||భారత్ నిలిచింది || విషపునాగును తాడుగా చేసి, కొండను తెచ్చి కవ్వము జేసి, పాల సంద్రమును చిలికినప్పుడే… హాలాహలము భరించినప్పుడే అమృతమొచ్చింది… దైవత్వమ్మును తెచ్చింది ……………………………………… ||భారత్ నిలిచింది || గుండుకు గుండెను అడ్డుపెట్టితే దేహముపై లాఠీలు ఆడితే ఉరికొయ్యల ఉయ్యాలలూగితే… అహింసతో నిటలాగ్నిరేపితే స్వతంత్రమొచ్చింది మనకు స్వరాజ్యమొచ్చింది. ……………………………………… ||భారత్ నిలిచింది || యుద్ధపిపాసులు, బద్ధ విరోధులు ప్రజలందరిలో అశాంతి…More
క్రిప్టో కరెన్సీ : కథా కమామీషు
క్రిప్టో కరెన్సీ ప్రస్తుతం ఎన్నో దేశాల ఆర్థిక వ్యవస్థలపై ప్రభావం చూపిస్తోంది. దీన్ని ఒక అవకాశం గా చూస్తున్నవాళ్ళు, దీన్ని బూచిగా చూపిస్తున్న వాళ్ళు, దీని ప్రభావం తో సాంప్రదాయ ఆర్థిక సిద్దాంతాలు కూడా మళ్ళీ వ్రాసుకోవాల్సిన అగమ్యగోచర పరిస్థితులు ఏర్పడుతున్నాయి.More
నే….!
నే….! నేను మాట్లాడకపోతే ఈ ప్రపంచం మూగవోతుంది నేను కదలకపోతే ఈ జగం నిశ్చలమవుతుంది నేను వినకపోతే ఈ లోకం వేదన అరణ్యరోదనవుతుంది నేను చూడకపోతే వెలుగు చీకటయిపోతుంది నేను శాసించకపోతే గాలులు స్తంభించిపోతాయి నేను అనంతాన్ని…నేను దిగ్దిగంతాన్ని నేను తరంగాన్ని… నేను కీమ్మీరపు గాలి తెమ్మెరను నేను రేణువును… గోపగోపికా కోపతాప స్వాంతనపు వేణువును నేను భావాన్ని… పక్ష్యాదుల కిలకిలారావాన్ని నేను జగత్తును… నేనే మహత్తును నేను మరచిపోబడ్డ గతాన్ని…. నేను దద్దరిల్లుతున్న ఉద్యమకారుడి స్వగతాన్ని…More
మన విద్య
మన విద్య అదేమిటో మా తాత తిన్న నేతి వాసన నా మూతి లోనుండి వస్తుందట… విద్యాధికులందరినీ చూడబోతే భారతీయులలాగే కనబడుతుంటారట ….. స్మశానంలో తిరిగి తిరిగి.. శివుడి కొరకు వెతికినట్టు విద్య పుట్టిన దేశం లో మన విలువలు ,వెలుగులు వెతకాలట… బోధాయనుడెవ్వడో ఎవడికి కావాలట… మార్కులొచ్చే “పైథాగరస్” వస్తే సరిపోతుందట ….. కణ్వుడు,శుశ్రుతుడు , భరద్వాజ, బ్రహ్మగుప్త,మిహిరుడు , ఆర్యభట్ట.. .. విద్వాంసుల విజ్ఞాన శాస్తవతంసుల ఆత్మలన్నీ కలిసి ఇప్పుడు మళ్లీ మళ్ళి ఆత్మహత్య…More
వేదం విశిష్టత 2
పార్ట్ 2 వేదము వజ్రాదపి కఠోరాణి మృదూని కుసుమాదపి లోకోత్తరాణాం చేఁ తాంసి కోహి విజ్ఞాతు మర్హసి మహాత్ముల హృదయాలు వజ్రముకన్నకఠోరాలు పూలకంటే సుకుమారాలు ఈ విధంగా అతి విచిత్రాలైన మహాత్ములయొక్క హృదయాలు. ఎవడు గుర్తింపగలడు ! ప్రత్యక్షేణాను మిత్వావా యస్థూపాయో న బుద్ధ్యతే ఏతం విదంతి వేదేన తస్మాద్వే దస్య వేదతామానవులు దైనందిన జీవితంలో మునిగి తమకుతోచిన విధంగా ఆ యా పనులను నిర్వర్తిస్తూ వుంటారు యిది కర్తవ్యమ్ యిది అకర్తవ్యం యిది ధర్మం యిది అధర్మం అని నిర్ణయించు కోలేరు. ధర్మాలను కంటితో చూచిగాని బుద్దితో ఊహించిగాని తెలుసుకోవడం కష్టం అట్లే…More
సినిమా మేధావులకు సూటి ప్రశ్న
మేదావులైన సినీ పెద్దలు, దర్శకులు, హీరోలకుసూటి ప్రశ్న ! ఈ సమాజం పట్ల మీకు బాధ్యత ఉందా ?మాలాంటి ఏంతో మంది అమాయక ప్రేక్షకులకు ఒక ప్రశ్న మనసులో ఉదయిస్తూ ఉంది….1. మీకు బాధ్యత ఉన్నట్టయితే సమాజం లో కీడు/ దుర్మార్గం పెంచి పోషించే విధంగా ఆశ్లీలతను ఎందుకు చూపిస్తారు…? హీరోయిన్ పాత్రలను, కొన్ని క్యారెక్టర్ లను అత్యంత హేయంగా, కేవలం శృంగారం కోసమే పుట్టినట్టుగా ఎందుకు చూపిస్తున్నారు…? హీరోయిన్ లకు మంచి వేషధారణ గూర్చి మీకు…More
అంధకారం కావాలి
అంధకారం కావాలి అంధకారం…..ఏ వెలుగులు సోకనట్టి అంధకారంఏ కిరణమూ ప్రసరించనట్టి అంధకారం…సంపూర్ణపు అంధకారం కావాలి.నిబిడాంధకారం కావాలి.…ఏ అలజడికి ఆదరని,ఏ చిరుకాంతులకు చెదరని, సంపూర్ణపు అంధకారం కావాలి మది, ప్రకృతి తో లయించేంత అంధకారంబుద్ధి ఏ రకమైన సంబంధమూ ఏర్పర్చుకోలేని అంధకారం….ఏ భయాలూ దరిచేరని అంధకారం… ఆస్పష్ట రేఖలు, రూపులూ, ధ్వనులూ, కల్పనలు….. అన్నీ అస్తిత్వం కోల్పోయేంతటి అంధకారం కావాలి…. ఏ భావనాత్మక సూర్యుడూఉదయించలేనంత అంధకారం కావాలిఅంధకారం కావాలి ప్రశాంతతను మించినదేదో ఈ అంధకారం లో కావాలి.నిర్భావావరణాని కన్నా…More