ఉద్యమ బోధన

ఎన్నినాళ్ళు, ఎన్నిఏళ్ళీ బానిసత్వపు వారసత్వం….. దించిన తల ఎత్తకుంటే మదిలో నిప్పులు మండకుంటే….. అడుగు ముందుకు వేయకుంటే…… తొలగిపోదీ కర్కశత్వం…….. … మొహం నిండా నవ్వు పంచి ఆయుధాన్ని వెనక దాచి సరిహద్దు కావల వాడక్కడ వాడుచూపిన మాయలొ పడి వాడువేసే వేటుకోసం తలలు వంచి మనమిక్కడ…… .. ఈ రాతిరి దాటిపోతే కాంతులేనోయ్ వెలుగులేనోయ్ మెరుపులేనోయ్, జిలుగులేనోయ్,…. అడుగు ముందుకు వేయవోయ్ ఈ గడప దాటి కదలవోయ్….. … నోటికాడి ముద్దలను లాగేసె గద్దలనొదలబోం….. ఇప్పుడిప్పుడే మా రెక్కల…More

కవిత్వమ్….!

కవిత్వమ్.. మనస్సు లోని మూలల్లోన, లోతుల్లోని పొరలల్లోన ఏదో జ్వాలా చలనం, ఇంకేదో ఏదో సంచలనం .. .. కవిత్వమొక సంవేదన, కవిత్వమొక ఆవేదన కవిత్వమొక సంఘర్షణ,కవిత్వమొక సత్యాన్వేషణ కవిత్వమొక బోధన, కావ్య సృజన ఒక ప్రసవ వేదన .. ..                                                                  …More

సైనికార్చన

నిన్ను చూస్తే, పిడుగుపాటుకు సిద్దంగా ఉన్న చెట్టు గుర్తొస్తుంది. నిన్ను చూస్తే, కర్కశంగా ఉవ్వెత్తున ఎగసి పోటెత్తి వస్తున్న వరదను నిశ్శబ్దంగా ఆపుతున్న ఆనకట్ట గుర్తొస్తుంది. నిన్ను చూస్తే, సైబీరియా చలిగాలుల నుండి కాపాడే సమున్నత హిమవన్నగం గుర్తొస్తుంది. నిన్ను చూస్తే, తన గూర్చి కాక, మా గూర్చి ఆలోచించి కరిగిపోయే కొవొత్తి గుర్తొస్తుంది. నిన్ను చూస్తే,  చంటిబిడ్డలను తన చెంగుకింద దాచి రక్షించే అమ్మ గుర్తొస్తుంది. మా కోసం పోరాడుతూ అలసిపోయి నేలపై ఒరిగిపోయేటప్పుడు…. నువు…More

వరాహావతార విశేషము

హిందువులు పందిని పూజిస్తారా? Collection from Whatsapp. ఈమధ్య కొంతమంది మ్లేచ్చులు హిందువులను విమర్శించడానికి ఇటువంటి ప్రేలాపనలు పెలుతున్నారు. ఏ అవతారం చెప్పబడని ఆవును పూజిస్తూ గోమూత్రం సేవించేవారు విష్ణువు అవతారమైన పందిని పూజించినా ఆ వరాహ మూత్రాన్ని సేవించకుండా అవమానిస్తున్నారని ఎద్దేవా చేస్తూ విమర్శిస్తున్నారు. ఇదంతా కొందరు పనిగట్టుకుని హైందవమ్ మీద విషం చేమ్మే వ్యక్తులు చెప్పిన విషయాలను మరింత మసాలా జోడించి హిందువులను అవమానించెట్టు వ్యాఖ్యలు చేస్తున్నారు. వారి వెర్రి వ్యాఖ్యలు పక్కనబెట్టి అసలు…More

స్త్రీ – మనుధర్మం: ఒక విశ్లేషణ

మనువు స్త్రీకి శత్రువా ?  Sri  Mvr Sastry గారి రచన. ముందుగా మనుధర్మం మీద కొందరు అపర మేధావుల అభిప్రాయాలు… “మనువు దుష్ట మేధావి. ‘న స్త్రీ స్వాతంత్ర్యమర్హతి ‘ అంటూ స్త్రీని ఏ దశలోనూ స్వేచ్ఛ లేని కట్టుబానిసగా ప్రకటించాడు. అది స్త్రీ జాతి అభ్యుదయానికి గొడ్డలిపెట్టు” …. మల్లాది సుబ్బమ్మ.“ఎట్టిపరిస్థితుల్లోనూ స్త్రీలు స్వేచ్ఛగా ప్రవర్తించటానికి వీల్లేదు అని మనువు ఖండితంగా చెప్పాడు.. భారతచరిత్రలో హిందూ స్త్రీల అధోగతికీ, వారి పతనానికీ మూలకారకుడు మను ధర్మ…More

కొన్ని ఉపయుక్త తెలుగు – ఇంగ్లీష్ పదాలు

ప్రస్తుతం మొత్తం ఇంగ్లీష్ మీడియం లో విద్యాబోధన నడుస్తుంది. తల్లితండ్రులకు మన ఇంటిలో ఉండే ప్రతి వస్తువుల పేర్లు ఇంగ్లీషులో తెలిసి ఉండాలి. అందుకే ఈ క్రింద ఇచ్చిన పదాలు తెలుసుకుంటే పిల్లలకు వస్తువుల పేర్లను ఇంగ్లీష్ లో చెప్పవచ్చు.                                   *Names of  Spices :* 1.  cumin seeds –  జీలకర్ర  2.  Turmeric…More

మహానటి సినిమా – స్పందన

మహానటి సినిమా చూసిన తరువాత నా స్పందనను తెలియ పరచాలని అన్పించింది. అయినా నేనేమిటి, సినిమాల గూర్చి రాయడమేమిటి అని మనసేందుకో లాగింది…. కాని మరేదో బలమైన భావం రాయడానికే ఉసిగొల్పింది …. అందుకే వ్రాస్తున్నాను.“మహానటి” కుటుంబ సభ్యులందరితో కలసి చూడదగ్గ సినిమా… ఒక మనోహర సెల్యులాయిడ్ దృశ్య కావ్యం.ముందుగా నిర్మాతలకు, ఇంత  గొప్ప అద్భుతమైన సినిమా అందించిన దర్శకుడు మరియు ఆయనకు సహాయ సహకారాలందించిన వ్యక్తులకు అభినందనలు. కేవలం అభినందన చెబితే సరిపోదు అంతకు మించి…More

స్వఛ్ భారత్ ఉద్యమం – తెలంగాణ

2014 వ సంవత్సరం ఆగస్ట్ 15వ తేదీన చారిత్రక ఎర్రకోట మీదనుండి గౌరవ ప్రధానమంత్రి స్వచ్చ భారత్ స్వప్నం గూర్చి యావత్ దేశాన్ని ఉద్దేశ్యించి ప్రసంగించడం తోప్రారంభమయిన స్వచ్చ ఉద్యమం, బస్తీలను, వార్డులను, పంచాయతీలను,మునిసిపాలిటీలను ముంచెత్తింది. దేశంలోని ప్రగతిని కాంక్షించే ప్రజలంతా స్వచ్చందంగా ముందుకు వచ్చి స్వచ్చ ఉద్యమంలోపాలుపంచుకున్నారు. మొత్తం దేశాన్ని స్వచ్చంగా మార్చేందుకు స్వచ్చ దూతలై, స్వచ్చాగ్రాహీలై ముందుకు కదులుతున్నారు.స్వచ్చ భారత్ మిషన్ ప్రారంభం. 9,91,56,459 31,80,1732014 నాటికి పారిశుధ్య శాతం 38.70 27.34మహాత్మ గాంధి…More

మాలో ఒకడు

మా అందరితో కలసి నడుస్తుంటే మాలో ఒకడివనుకున్నాం మాతోపాటే ఉండి నువ్వు వెనకగా నడుస్తూ మిగిలిన వాళ్ళను ముందుకు నడిపిస్తూ ఉంటే, మా లోనే వెనకబడినవాడివేమో అనుకున్నాం కొంచెం దూరం నడిచాక మా కన్నా ఎంతో ముందు నువ్వు మిగతా వాళ్లందరితో కలసి కనిపిస్తే…. ఆశ్చర్యపడి … సరేలే మా కన్ను గప్పి ఎప్పుడో ముందుకు పరిగెట్టుకుంటూ వెళ్ళావనుకున్నాం…….. దారిపక్కనున్న చెట్టెక్కి చూస్తే చుట్టూ పక్కల ఉన్న ఊళ్ళన్నీ నీ కోసం కదిలొస్తున్నాయని తెలిసీ … ఒకింత…More

సహనం

అద్దం చెప్పే అందమైన అబద్ధం నా మొహం. అద్దం నా మనస్సులోకి చూడలేక పోతుందా… లేక చూపిస్తున్న సత్యాన్ని నేనర్థం చేసుకోలేకపోతున్నానా…? ఏమో…? కనిపించే ప్రతీ అందమైన దృశ్యం, బడబాగ్నులను దాచుకుందేమో… నీలాకాశ నిర్మలత్వం, నిటలాక్షుని అగ్నికీలలను కప్పెస్తుందేమో…. నిబ్బరంగా కనిపించే గుండె, నిరంకుశ పాషాణధ్వానాలను లోలోపల అణచి వేసిందేమో……. గరళం మింగి నిర్మలంగా నవ్వుతున్న నీలకంఠుడిని చూసి చూసి….. త్రిశూలధారియై దుష్టుల దునుమాడాల్సిన కాలరూపుడిని మర్చిపోయినట్టున్నామ్…. ఈ సహనం కూడా భూకంపం వచ్చినట్టు, సునామీ పుట్టినట్టు,…More