నేను నా మది -1

ఉత్తుంగ భావ తరంగమేదో బయటికి తోసుకొచ్చి కవిత్వీకరించ బడ్డాకప్రసన్నంగా నిశీధి గది లోకి జారుకుంది మది….నిస్త్రాణ గా నేను.More

మానవత్వం (ఎలీజీ)

ఏడవండి…… ఏడవండి……. ఇంకా గట్టిగా ఏడవండి…….. సమాజంలో ఈ మనుషుల్లో మనసుల్లో, చనిపోయిన నా నేస్తం కనబడటం లేదని కనీసం ప్రతిబింబమయినా లేదని ఏడవండి……….. …….. కోటలలో నిధులకోసం బంగారం కోసం సముద్రాల్లో నూనెల నిక్షేపాల కోసం పగడాల కోసం, రత్నాల కోసం వెతకడం కాదు, దొరకలేదని బాధపడటం కాడు…………… ఏడవండి… …….. ఏ ఒక్కరూ ఏడ్వటం లేదు కదా…… పైగా నవ్వుతున్నారు……… ————————- ఎవరికి పట్టిందిలే  నేస్తం నువు కనబడకుండా పోతే ఏ సీరియలూ ఆగలేదు బ్రేకింగ్ న్యూసులు ఆగకుండా…More

సుషుప్తాత్మలు

॥ సుషుప్తాత్మలు … ॥   నాకొక  టివి ఉన్నది క్రికెట్ మ్యాచ్ వస్తున్నది  అడ్వర్ టైజు మెంటు చూస్తే  చాలులోకంలోని వృద్ధి అంతా తెలిసిపోతూనే ఉన్నది  పేపర్లు , చానళ్ళు రిపోర్టర్లు, మేధావులు నాయకులు, అధికారులు …  ఎవ్వరికీ అందకుండ మానవాభివృద్ధి జరిగి జరిగి పోతున్నది  ఎవరిమట్టుకు వారికి  ప్రపంచమంతా బాగానే ఉన్నది  నాకు మాత్రం గుండె లోతుల్లో  ఎక్కడో మండుతున్నట్టనిపిస్తున్నది.. ..   నీడలే  సోకనట్టి సంపూర్ణపు వెలుగొకటి  అందరు చేతులు వేసిన అబివృద్ధి సౌధమొకటి  ప్రయత్నిస్తే ప్రయత్నిస్తే  సాధ్యమనే అనిపిస్తున్నది.. .. …More

ఉద్యమ బోధన

ఎన్నినాళ్ళు, ఎన్నిఏళ్ళీ బానిసత్వపు వారసత్వం….. దించిన తల ఎత్తకుంటే మదిలో నిప్పులు మండకుంటే….. అడుగు ముందుకు వేయకుంటే…… తొలగిపోదీ కర్కశత్వం…….. … మొహం నిండా నవ్వు పంచి ఆయుధాన్ని వెనక దాచి సరిహద్దు కావల వాడక్కడ వాడుచూపిన మాయలొ పడి వాడువేసే వేటుకోసం తలలు వంచి మనమిక్కడ…… .. ఈ రాతిరి దాటిపోతే కాంతులేనోయ్ వెలుగులేనోయ్ మెరుపులేనోయ్, జిలుగులేనోయ్,…. అడుగు ముందుకు వేయవోయ్ ఈ గడప దాటి కదలవోయ్….. … నోటికాడి ముద్దలను లాగేసె గద్దలనొదలబోం….. ఇప్పుడిప్పుడే మా రెక్కల…More

కవిత్వమ్….!

కవిత్వమ్.. మనస్సు లోని మూలల్లోన, లోతుల్లోని పొరలల్లోన ఏదో జ్వాలా చలనం, ఇంకేదో ఏదో సంచలనం .. .. కవిత్వమొక సంవేదన, కవిత్వమొక ఆవేదన కవిత్వమొక సంఘర్షణ,కవిత్వమొక సత్యాన్వేషణ కవిత్వమొక బోధన, కావ్య సృజన ఒక ప్రసవ వేదన .. ..                                                                  …More

సైనికార్చన

నిన్ను చూస్తే, పిడుగుపాటుకు సిద్దంగా ఉన్న చెట్టు గుర్తొస్తుంది. నిన్ను చూస్తే, కర్కశంగా ఉవ్వెత్తున ఎగసి పోటెత్తి వస్తున్న వరదను నిశ్శబ్దంగా ఆపుతున్న ఆనకట్ట గుర్తొస్తుంది. నిన్ను చూస్తే, సైబీరియా చలిగాలుల నుండి కాపాడే సమున్నత హిమవన్నగం గుర్తొస్తుంది. నిన్ను చూస్తే, తన గూర్చి కాక, మా గూర్చి ఆలోచించి కరిగిపోయే కొవొత్తి గుర్తొస్తుంది. నిన్ను చూస్తే,  చంటిబిడ్డలను తన చెంగుకింద దాచి రక్షించే అమ్మ గుర్తొస్తుంది. మా కోసం పోరాడుతూ అలసిపోయి నేలపై ఒరిగిపోయేటప్పుడు…. నువు…More

మాలో ఒకడు

మా అందరితో కలసి నడుస్తుంటే మాలో ఒకడివనుకున్నాం మాతోపాటే ఉండి నువ్వు వెనకగా నడుస్తూ మిగిలిన వాళ్ళను ముందుకు నడిపిస్తూ ఉంటే, మా లోనే వెనకబడినవాడివేమో అనుకున్నాం కొంచెం దూరం నడిచాక మా కన్నా ఎంతో ముందు నువ్వు మిగతా వాళ్లందరితో కలసి కనిపిస్తే…. ఆశ్చర్యపడి … సరేలే మా కన్ను గప్పి ఎప్పుడో ముందుకు పరిగెట్టుకుంటూ వెళ్ళావనుకున్నాం…….. దారిపక్కనున్న చెట్టెక్కి చూస్తే చుట్టూ పక్కల ఉన్న ఊళ్ళన్నీ నీ కోసం కదిలొస్తున్నాయని తెలిసీ … ఒకింత…More

సహనం

అద్దం చెప్పే అందమైన అబద్ధం నా మొహం. అద్దం నా మనస్సులోకి చూడలేక పోతుందా… లేక చూపిస్తున్న సత్యాన్ని నేనర్థం చేసుకోలేకపోతున్నానా…? ఏమో…? కనిపించే ప్రతీ అందమైన దృశ్యం, బడబాగ్నులను దాచుకుందేమో… నీలాకాశ నిర్మలత్వం, నిటలాక్షుని అగ్నికీలలను కప్పెస్తుందేమో…. నిబ్బరంగా కనిపించే గుండె, నిరంకుశ పాషాణధ్వానాలను లోలోపల అణచి వేసిందేమో……. గరళం మింగి నిర్మలంగా నవ్వుతున్న నీలకంఠుడిని చూసి చూసి….. త్రిశూలధారియై దుష్టుల దునుమాడాల్సిన కాలరూపుడిని మర్చిపోయినట్టున్నామ్…. ఈ సహనం కూడా భూకంపం వచ్చినట్టు, సునామీ పుట్టినట్టు,…More