సైనికార్చన

నిన్ను చూస్తే, పిడుగుపాటుకు సిద్దంగా ఉన్న చెట్టు గుర్తొస్తుంది. నిన్ను చూస్తే, కర్కశంగా ఉవ్వెత్తున ఎగసి పోటెత్తి వస్తున్న వరదను నిశ్శబ్దంగా ఆపుతున్న ఆనకట్ట గుర్తొస్తుంది. నిన్ను చూస్తే, సైబీరియా చలిగాలుల నుండి కాపాడే సమున్నత హిమవన్నగం గుర్తొస్తుంది. నిన్ను చూస్తే, తన గూర్చి కాక, మా గూర్చి ఆలోచించి కరిగిపోయే కొవొత్తి గుర్తొస్తుంది. నిన్ను చూస్తే,  చంటిబిడ్డలను తన చెంగుకింద దాచి రక్షించే అమ్మ గుర్తొస్తుంది. మా కోసం పోరాడుతూ అలసిపోయి నేలపై ఒరిగిపోయేటప్పుడు…. నువు…More